Ishaan Khattar: 24 ఏళ్లు పెద్ద హీరోయిన్‏తో సినిమా.. ఎంజాయ్ చేశానన్న యంగ్ హీరో..

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే హీరోగా స్టార్ డమ్ సంపాదించుకుంటున్నాడు నటుడు ఇషాన్ ఖట్టర్. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలు, వెబ్ సిరీస్ ద్వారా సినీప్రియులను అలరిస్తున్నాడు. ఇక ఇప్పుడు ఈ హీరో హోమ్ బౌండ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని విడుదలకు ముందే 78వ కేన్స్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రీమియర్ షో ప్రదర్శించారు మేకర్స్.

Ishaan Khattar: 24 ఏళ్లు పెద్ద హీరోయిన్‏తో సినిమా.. ఎంజాయ్ చేశానన్న యంగ్ హీరో..
Tabu

Updated on: May 27, 2025 | 7:51 AM

బాలీవుడ్ యంగ్ హీరో ఇషాన్ ఖట్టర్ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో బిజీగా ఉంటున్నారు. ధడక్ సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమైన ఇషాన్.. ఇప్పుడు ది రాయల్స్ అనే వెబ్ సిరీస్ ద్వారా సినీప్రియులను అలరిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా తాను నటించిన ఏ సూటబుల్ బాయ్ వెబ్ సిరీస్ రోజులను గుర్తు చేసుకున్నాడు. ఈ చిత్రంలో తనకంటే వయసులో 24 ఏళ్లు పెద్దదైన టబుతో కలిసి సన్నిహిత సన్నివేశాల్లో నటించడంపై ఇషాన్ ఖట్టార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎ సూటబుల్ బాయ్ వెబ్ సిరీస్ 2020లో వచ్చింది. ఇందులో ఇషాన్, టబు ఇద్దరి మధ్య కొన్ని సన్నివేశాలు ఉండడం చూసి జనాలు ఆశ్చర్యపోయారు. ఇద్దరి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ పై నెటిజన్స్ భిన్నంగా రియాక్ట్ అయ్యారు. తాజాగా ఈ విషయం పై ఇషాన్ ఖట్టర్ స్పందించారు. తాము తమ వయసు మధ్య వ్యత్యాసం గురించి ఎప్పుడూ పట్టించుకోలేదని అన్నారు.

” ఇద్దరి మధ్య ఇంత వయసు తేడా ఉన్నప్పటికీ.. స్టోరీలో ఇలాంటి సీన్స్ చూస్తుంటే మీకు వింతగా అనిపించవచ్చు. కానీ ఆ స్టోరీ రాసిన తీరు ఆ సన్నివేశానికి న్యాయం చేసింది. అసలు మేము ఏజ్ గ్యాప్ గురించి పట్టించుకోలేదు. టబు వంటి నటితో అలాంటి సీన్ చేయడం అంటే దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను ఏమాత్రం ఆందోళనగా ఫీల్ కాలేదు. నిజానికి చాలా సేఫ్ గా ఫీలయ్యాను. నేను ఏం చేస్తున్నాననో తెలుసుకోగలిగే నటితో కలిసి నటిస్తుండటమే అందుకు కారణం. టబులో అదే గొప్ప విషయం. ఓ సీన్లో మేము ఏం చేస్తున్నామనే దానిపై ఎప్పుడూ మాట్లాడుకోలేదు ” అంటూ చెప్పుకొచ్చారు ఇషాన్ ఖట్టర్.

టబు ఎప్పుడూ చాలా సరదాగా ఉంటుందని.. సెట్ లో చిన్న పిల్లలా ఉంటుందని.. జోక్స్ వేస్తుందని.. అంతలోనే పాత్రలో లీనమైపోతుందని అన్నారు. ఆమెతో నటించడం చాలా సరదాగా అనిపించిందని చెప్పుకొచ్చాడు ఇషాన్ ఖట్టర్.

ఇవి కూడా చదవండి :  

Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..

Megastar Chiranjeevi: అమ్మ బాబోయ్.. చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్‏ గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్ అవ్వాల్సిందే..

OTT Movie: బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ.. 3 కోట్లతో తీస్తే రూ.70 కోట్ల కలెక్షన్స్.. 2 గంటలు నాన్‏స్టాప్ సస్పెన్స్..

Actress: ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..