Shah Rukh Khan: నెక్స్ట్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన షారుఖ్ ఖాన్.. షూటింగ్ ఎప్పుడంటే

|

May 04, 2024 | 7:46 PM

పఠాన్, జవాన్ సినిమాలతో వెయ్యి కోట్లు వసూళ్లు రాబట్టింది. పఠాన్ సినిమా వెయ్యి కోట్లు వసూల్ చేసింది. అలాగే జవాన్ సినిమా కోసం వెయ్యి కోట్లకు పై వసూల్ చేసింది. డంకి సినిమా కూడా మంచి వసూళ్లను రాబట్టింది. ఇక ఇప్పుడు షారూఖ్ ఖాన్ జాగ్రత్తగా ఎంచుకుంటున్నాడు. షారుఖ్ ఖాన్ కొత్త సినిమా గురించి ఇప్పుడు అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

Shah Rukh Khan: నెక్స్ట్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన షారుఖ్ ఖాన్.. షూటింగ్ ఎప్పుడంటే
Shah Rukh Khan
Follow us on

షారుఖ్ ఖాన్ వరుస ఫ్లాప్స్ తర్వాత వరుసగా సినిమాలు చేసి హిట్స్ అందుకున్నాడు. చాలా రోజుల తర్వాత పఠాన్, జవాన్, డంకి సినిమాలతో వరుస విజయాలను అందుకున్నారు. అలాగే పఠాన్, జవాన్ సినిమాలతో వెయ్యి కోట్లు వసూళ్లు రాబట్టింది. పఠాన్ సినిమా వెయ్యి కోట్లు వసూల్ చేసింది. అలాగే జవాన్ సినిమా కోసం వెయ్యి కోట్లకు పై వసూల్ చేసింది. డంకి సినిమా కూడా మంచి వసూళ్లను రాబట్టింది. ఇక ఇప్పుడు షారూఖ్ ఖాన్ జాగ్రత్తగా ఎంచుకుంటున్నాడు. షారుఖ్ ఖాన్ కొత్త సినిమా గురించి ఇప్పుడు అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు షారూఖ్ ఖాన్  అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. తన తదుపరి సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే సమాచారాన్ని ఇచ్చాడు షారుఖ్.

ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఓనర్‌గా ఉన్న షారుక్ ఖాన్ మ్యాచ్ చూసేందుకు వచ్చినప్పుడు స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా తదుపరి సినిమా గురించి మాట్లాడారు. ఇన్ని రోజులు విరామం తీసుకుని జులై లేదా ఆగస్టులో షూటింగ్ ప్రారంభించనున్నారని అప్డేట్ ఇచ్చింది.

‘గతేడాది మూడు సినిమాలు చేశాను. అందుకే కాస్త రెస్ట్ తీసుకుంటున్నా అన్నారు. మూడు సినిమాల కోసం చాలా కష్టపడ్డాను. అందుకే విరామం తీసుకున్నాను. అన్ని మ్యాచ్‌లు చూసేందుకు వస్తానని జట్టుకు చెప్పాను. నా తదుపరి సినిమా షూటింగ్ జూలై లేదా ఆగస్టులో ఉంటుంది. జూన్‌లో ప్లాన్‌ చేయబోతున్నాం. అప్పటి వరకు టీమ్‌కి సంబంధించిన అన్ని మ్యాచ్‌లు చూసేందుకు హ్యాపీగా వస్తాను’’ అని షారూఖ్ చెప్పాడు.

కొన్నాళ్లుగా షారుక్ సినిమాలన్నీ వరుసగా పరాజయం పాలవుతున్నాయి. ఎంత డిఫరెంట్ ప్రయత్నాలు చేసినా ప్రేక్షకులు ఆ సినిమాలను ఆదరించలేదు. షారుఖ్ ఖాన్ కెరీర్ ముగిసిపోయిందని చాలా మంది మాట్లాడుకున్నారు. కానీ 2023లో ఆయన మ్యాజిక్ చేశాడు. ‘పఠాన్’, ‘జవాన్’ సినిమాలు వెయ్యి కోట్ల రూపాయలు వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించాయి. ‘డంకీ’ సినిమా సంతృప్తికరమైన కలెక్షన్లు రాబట్టింది. షారుఖ్ ఖాన్ తదుపరి సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. షారుఖ్ ఖాన్ పిల్లలు కూడా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.