Bollywood: అప్పుడే దివాళీని టార్గెట్ చేసిన బాలీవుడ్ స్టార్స్..

|

Mar 21, 2023 | 8:31 PM

టాప్ స్టార్స్‌ అంతా దివాళీని టార్గెట్ చేస్తుండటంతో అది కూడా మోస్ట్ ప్రస్టీజియస్ మూవీస్‌తో కావటంతో ఇప్పటి నుంచే డిస్కషన్ జరుగుతోంది.

Bollywood: అప్పుడే దివాళీని టార్గెట్ చేసిన బాలీవుడ్ స్టార్స్..
Bollywood
Follow us on

ఇంకా 2023 దివాళీకే చాలా టైమ్‌ ఉంది. అయినా.. 2024 దివాళీ గురించి మాట్లాడుకుంటున్నారు నార్త్ సినీ జనాలు. ఆల్రెడీ ఆ సీజన్‌ మీద కర్చీఫ్ వేసిన సినిమాలే ఇందుకు కారణం. టాప్ స్టార్స్‌ అంతా దివాళీని టార్గెట్ చేస్తుండటంతో అది కూడా మోస్ట్ ప్రస్టీజియస్ మూవీస్‌తో కావటంతో ఇప్పటి నుంచే డిస్కషన్ జరుగుతోంది. ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న బాలీవుడ్ ఇండస్ట్రీ.. రిలీజ్‌ల విషయంలోనూ పక్కా ప్లానింగ్‌తో ముందుకెళుతోంది. అందుకే నెక్ట్స్ ఇయర్ దివాళీ రిలీజ్‌ల విషయంలోనూ ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేస్తోంది. అజయ్‌ దేవగన్‌, సల్మాన్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్ లాంటి టాప్ స్టార్స్‌ కూడా ప్రజెంట్ ఇదే ప్లానింగ్‌లో ఉన్నారు.

బ్లాక్ బస్టర్ యాక్షన్ సిరీస్‌ సింగం ఫ్రాంచైజీలో నెక్ట్స్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అజయ్‌ దేవగన్‌. సింగం ఎగైన్‌ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రజెంట్ భోళా ప్రమోషన్‌లో బిజీగా ఉన్న అజయ్‌, సింగం 3 ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా కానిచ్చేస్తున్నారు. ఈ సినిమాను 2024 దివాళీకి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. భూల్‌ భులయ్యా 2తో బ్లాక్ బస్టర్ అందుకున్న కార్తీక్ ఆర్యన్‌.. షార్ట్ గ్యాప్‌లోనే నెక్ట్స్ పార్ట్‌ను పట్టాలెక్కిస్తున్నారు. ఆల్రెడీ భూల్ భులయ్యా 3కి సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ కూడా వచ్చేసింది. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాను నెక్ట్స్ ఇయర్ దివాళీ బరిలో దించే ప్లాన్‌లో ఉన్నారు మేకర్స్‌.

లాంగ్ డిస్కషన్‌ తరువాత హెరాఫెరీ సీక్వెల్‌కు ఓకే చెప్పిన అక్షయ్‌ కుమార్‌ కూడా 2024 దివాళీనే టార్గెట్ చేస్తున్నారు. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌తో ఎలాగైనా బౌన్స్‌ బ్యాక్‌ అవ్వాలన్న ఆలోచనలో ఉన్నారు ఖిలాడీ హీరో. కండల వీరుడు సల్మాన్‌ కూడా ఇదే సీజన్‌ను టార్గెట్ చేస్తున్నారట. తన కెరీర్‌లో మెమరబుల్ హిట్స్ ఇచ్చిన సూరజ్‌ బర్జాత్య దర్శకత్వంలో మరో మూవీకి ఓకే చెప్పారు భాయ్‌జాన్‌.. ఈ సినిమాను కూడా 2024 సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఇలా టాప్ స్టార్స్ అంతా ఒకే సీజన్‌ను టార్గెట్ చేస్తుండటంతో.. ఇప్పటి నుంచే 24 దివాళీ హాట్ టాపిక్ అవుతోంది.