Lucifer Telugu remake : మెగాస్టార్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో.. లూసిఫర్ తెలుగు రీమేక్‌‌‌‌లో కీలక పాత్రలో ఆ హీరో

|

Aug 16, 2021 | 10:10 PM

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ ను పూర్తిచేసే పనిలో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ కీలకపాత్రలో నటిస్తున్నాడు..

Lucifer Telugu remake : మెగాస్టార్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో.. లూసిఫర్ తెలుగు రీమేక్‌‌‌‌లో కీలక పాత్రలో ఆ హీరో
Megastar
Follow us on

Lucifer Telugu remake : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్‌‌‌‌ను పూర్తిచేసే పనిలో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. చరణ్- చిరు ఇద్దరు ఈ సినిమాలో నక్సలైట్స్‌‌‌‌గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, పాట ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా కోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీలో చరణ్ సరసన పూజాహెగ్డే నటిస్తుండగా చిరుకి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ మలయాళ సూపర్ హిట్ సినిమా లూసిఫెర్ సినిమాను రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఈ సినిమా కథలో చాలా మార్పులు చేసినట్టు తెలుస్తుంది. ఒరిజినల్‌‌‌‌లో లేని హీరోయిన్ పాత్రను కూడా తెలుగు కోసం సృష్టిస్తున్నారట. ఆపాత్రలో నయనతార నటిస్తుందని తెలుస్తోంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో కీలక పాత్రలో కనిపించనునండని అంటున్నారు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ లూసిఫర్ రీమేక్‌‌‌‌లో నటిస్తున్నాడన్న వార్త ఇప్పుడు వైరల్‌‌‌గా మారింది. సల్మాన్ ఖాన్ ఇప్పటికే తన తేదీలను ఖరారు చేసాడని అంటున్నారు. ఈ విషయాన్ని అత్యంత ఘనంగా ప్రకటించేందుకు మెగా కాంపౌండ్ సిద్ధమవుతోందని తెలుస్తోంది. మరి ఈవార్తల్లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది. అలాగే ఈ సినిమాలో సత్యదేవ్ విలన్‌‌‌గా నటించనున్నాడు.


మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5: ఈసారి బిగ్‌బాస్‌ బజ్‌కు హోస్ట్‌గా వ్యవహరించేంది ఎవరో తెలుసా.? లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన బోల్డ్‌ బ్యూటీ.

Vijay’s Beast : బీస్ట్ సినిమాకు బెస్ట్ బిజినెస్.. భారీ ధరకు అమ్ముడు పోయిన దళపతి విజయ్ సినిమా ఓటీటీ రైట్స్

అంకల్‌తో యంగ్ లేడి రొమాన్స్ క్రేజీగా వస్తున్నా క్రేజీ అంకుల్స్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్..:Crazy Uncles Pre Release Video.