సినిమా సెలబ్రెటీలకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతూ ఉంటాయి. సినీ పజిల్స్ కు సోషల్ మీడియాలో క్రేజ్ ఉంది. ఈ ఫోటోలు తెగ చక్కర్లు కొడుతూఉంటాయి. పై ఫొటోలో ఉన్న ఫోటోను గమనించారా..? ఆ ఫొటోలో ఒకరు కాదు.. ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నారు. ఆ హీరోలు ఎవరో గుర్తుపట్టారా.? ఆ స్టార్ హీరోల సినిమాలు భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంటున్నాయి. ఇంతకు ఆ ఇద్దరూ హీరోలు ఎవరో గుర్తుపట్టరా..? చాలా మంది ఆ హీరోలను కనిపెట్టలేక పోయారు. ఇంతకు ఆ ఇద్దరూ హీరోలు ఎవరంటే..
పై ఫొటోలో ఉన్న ఇద్దరూ హీరోలు ఎవరో కాదు.. బాలీవుడ్ స్టార్ హీరోలు జాన్ అబ్రహం , హృతిక్ రోషన్. ఈ ఇద్దరు స్టార్ హీరోల చైల్డ్ హుడ్ ఫోటోలు సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్‌గా మారింది. హృతిక్ రోషన్, జాన్ అబ్రహం క్లాస్‌మేట్స్ అనే విషయం చాలా మందికి తెలియదు. ఈ ఫోటోలో చిన్ననాటి హృతిక్ రోషన్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. వీరిద్దరూ ఇప్పుడు స్టార్ ఆర్టిస్టులుగా, బాలీవుడ్‌లో చాలా డిమాండ్ ఉన్న నటులుగా రాణిస్తున్నారు. ఈ ఇద్దరూ ఒకప్పుడు కలిసి చదువుకున్నారు.
స్కూల్లో చదువుతున్నప్పుడు తీసిన గ్రూప్ ఫోటోలో హృతిక్ రోషన్, జాన్ అబ్రహం చాలా క్యూట్ గా ఉన్నారు. హృతిక్ రోషన్ తెల్లటి యూనిఫాం ధరించగా, జాన్ అబ్రహం బ్రౌన్ యూనిఫాం ధరించాడు. తమ అభిమాన హీరోలు ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నారని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోటో జాన్ అబ్రహం, హృతిక్ రోషన్ అభిమానుల సోషల్ మీడియా పేజీలలో వైరల్ అవుతోంది. అలాగే దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. హృతిక్ రోషన్ ఫ్యామిలీ గురించి అందరికి తెలిసిందే.. ఆయన తండ్రి రాకేష్ రోషన్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు. హృతిక్ రోషన్ బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత హీరోగా ఓ వెలుగు వెలిగాడు. అతను టాలెంటెడ్ డ్యాన్సర్ కూడా.. ఆయన నటిస్తున్న చిత్రం ‘వార్ 2’ షూటింగ్ దశలో ఉంది. అలాగే జాన్ అబ్రహం 2003లో ‘జిస్మ్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఆ సినిమాలో బిపాసా బసుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.