Prabhas: ప్రభాస్ సినిమాలో ఛాన్స్.. ఏకంగా రూ.20 కోట్లు డిమాండ్ చేస్తోన్న హీరోయిన్.. ?

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డార్లింగ్ నటిస్తోన్న సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు కొత్త ప్రాజెక్ట్స్ సైతం పూర్తి చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ప్రభాస్. ఈ క్రమంలో తాజాగా ప్రభాస్ కొత్త సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ను ఎంపిక చేశారట.

Prabhas: ప్రభాస్ సినిమాలో ఛాన్స్.. ఏకంగా రూ.20 కోట్లు డిమాండ్ చేస్తోన్న హీరోయిన్.. ?
Prabhas

Updated on: May 14, 2025 | 8:04 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అమ్ కమింగ్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కల్కి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ప్రభాస్.. ఇప్పుడు రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై భారీ హైప్ నెలకొంది. అలాగే డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇవే కాకుండా త్వరలోనే మరిన్ని ప్రాజెక్ట్స్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇప్పుడు డార్లింగ్ కొత్త సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ నటించనుందని.. అందుకు ఆమె భారీగానే డిమాండ్ చేస్తుందని టాక్ నడుస్తుంది. ఇంతకీ ఎవరా హీరోయిన్.. ? ఏ సినిమా అనేది తెలుసుకుందామా. ఆ బ్యూటీ మరెవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే.

యానిమల్ సినిమాతో బాక్సాఫీస్ షేక్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ఇప్పుడు ప్రభాస్ ప్రధాన పాత్రలో స్పిరిట్ అనే సినిమా చేయనున్నారు. ఇందులో డార్లింగ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో డార్లింగ్ నటించనుండడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. దీంతో ఇందులో డార్లింగ్ సరసన దీపికా పదుకొణేను సంప్రదించారని చిత్రయూనిట్.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటించేందుకు దీపికా రూ.20 కోట్లు పారితోషికం డిమాండ్ చేసినట్లుగా సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇదివరకే ప్రభాస్, దీపికా కలిసి కల్కి 2898 ఏడీ చిత్రంలో నటించారు. ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ లోనూ కలిసి నటించనున్నారు. అలాగే ఇప్పుడు స్పిరిట్ సినిమాలోనూ మరోసారి వీరిద్దరి జోడి అలరించనుంది. స్పిరిట్ సినిమా కోసం ఇదివరకు మృణాల్, అలియా భట్, రష్మిక మందన్నా పేర్లు తెరపైకి వచ్చాయి.

ఇవి కూడా చదవండి :  

 Tollywood: వామ్మో.. తిని తిని 108 కిలోలు పెరిగిపోయిందట.. ఈ యాంకరమ్మను గుర్తుపట్టారా.. ?

Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..

Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..

Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‏తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..