బాలీవుడ్ బిపాసా బసు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన టక్కరి దొంగ సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఇక్కడ కంటే బాలీవుడ్ లోనే ఆమె సినిమాలు చేసి పాపులర్ అయ్యింది. హిందీ, తమిళ్,తెలుగు, బెంగాలీ భాషలతో పాటు హాలీవుడ్ లోనూ సినిమా చేసింది ఈ చిన్నది. ఇక ఇండియాలో భారీ రెమ్యునరేషన్స్ తీసుకునే ముద్దుగుమ్మల్లో ఈ చిన్నది కూడా ఒకరు. తాజాగా బిపాసా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. శనివారం బిపాసా పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. తనకు కూతురు పుట్టిందని సోషల్ మీడియా ద్వారా తెలిపారు బిపాసా దంపతులు. బిపాసా కరణ్ సింగ్ ను 2016లో వివాహం చేసుకున్నారు.
బిపాసా 2002లో డినో మోరియాతో విడిపోయింది. ఆ తర్వాత స్టార్ హీరో జాన్ అబ్రహంతో ప్రేమాయణం కొససాగించింది. ఆ తర్వాత హర్మన్ బవేజాతో డేటింగ్ చేసింది. చివరకు అలోన్ సినిమాలో తనతో కలిసి నటించిన కరణ్ సింగ్ తో ప్రేమలో పడింది. ఈ ఇద్దరు 2016లో పెళ్లి చేసుకున్నారు.
ఇక ఇప్పుడు ఈ ఇద్దరు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తమకు పాప పుట్టిందని తెలిపారు. దాంతో ఈ దంపతులకు సినిమా తారలు, ప్రముఖులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పాపకు దేవి బసు సింగ్ గ్రోవర్ అనే పేరుకూడా పెట్టేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో బిపాసా షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.