Salman Khan: బిగ్ బాస్ షోకి సల్మాన్ ఎన్ని కోట్లు తీసుకుంటారో తెలుసా..? ఓ పాన్ ఇండియా సినిమా తీయొచ్చు

సల్మాన్ రెమ్యునరేషన్ పై మీడియాలో చర్చ జరుగుతోంది. భారతదేశంలో బిగ్ బాస్ షోకి చాలా మంది అభిమానులు ఉన్నారు. వంద రోజుల పాటు సాగే ఈ కార్యక్రమాన్ని పలు భాషల్లో ప్రముఖ తారలు హోస్ట్ లుగా చేస్తున్నారు.  తెలుగులో నాగార్జున, మలయాళంలో మోహన్‌లాల్, తమిళంలో విజయ్ సేతుపతి (గతంలో కమల్ హాసన్),  హిందీలో సల్మాన్ ఖాన్ ఇలా ఇంకొంతమంది ఉన్నారు.

Salman Khan: బిగ్ బాస్ షోకి సల్మాన్ ఎన్ని కోట్లు తీసుకుంటారో తెలుసా..? ఓ పాన్ ఇండియా సినిమా తీయొచ్చు
Salman Khan
Follow us

|

Updated on: Oct 08, 2024 | 12:35 PM

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటనలోనే కాదు ప్రెజెంటేషన్‌లోనూ తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. బిగ్ బాస్ హోస్ట్ గా అదరగొడుతున్నాడు సల్మాన్.  ప్రస్తుతం ఈ సల్మాన్ రెమ్యునరేషన్ పై మీడియాలో చర్చ జరుగుతోంది. భారతదేశంలో బిగ్ బాస్ షోకి చాలా మంది అభిమానులు ఉన్నారు. వంద రోజుల పాటు సాగే ఈ కార్యక్రమాన్ని పలు భాషల్లో ప్రముఖ తారలు హోస్ట్ లుగా చేస్తున్నారు.  తెలుగులో నాగార్జున, మలయాళంలో మోహన్‌లాల్, తమిళంలో విజయ్ సేతుపతి (గతంలో కమల్ హాసన్),  హిందీలో సల్మాన్ ఖాన్ ఇలా ఇంకొంతమంది ఉన్నారు.

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అలాగే ప్రెజెంటర్లకు చాలా ఎక్కువ పారితోషికం ఇస్తారు. ప్రస్తుతం ఈ షో హిందీ, మరాఠీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ అలగే  బెంగాలీఇలా ఏడు భాషల్లో నడుస్తోంది. ఇన్ని భాషల్లో షో నడుస్తున్నప్పటికీ, రెమ్యునరేషన్ విషయంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ముందున్నట్లు సమాచారం. కలర్స్ టీవీలో ప్రసారమవుతున్న హిందీ బిగ్ బాస్ 18వ సీజన్ గత రోజు ప్రారంభమైంది. ఆ తర్వాత ఇప్పుడు స్టార్ రెమ్యునరేషన్ గురించి చర్చ జరుగుతోంది.

ఈ షో హోస్ట్‌గా వ్యవహరించినందుకుగాను సల్మాన్ ఖాన్ నెలకు దాదాపు 60 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నట్లు సమాచారం. అలాంటప్పుడు, బిగ్ బాస్ సీజన్ పూర్తయ్యేలోగా.. దాదాపు 250 కోట్ల రూపాయలను అందుకుంటున్నాడు. సల్మాన్ ఖాన్ చాలా భారీ బడ్జెట్ చిత్రాల ఖర్చు కంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటాడు. బిగ్ బాస్ హిందీ 17వ సీజన్ దాదాపు 17 వారాల పాటు నడిచింది. ఈసారి కూడా ఇలాగే కొనసాగితే భారతీయ టెలివిజన్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన హోస్ట్‌గా సల్మాన్ ఖాన్ రికార్డు సృష్టించనున్నాడు. దశాబ్ద కాలంగా ఈ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సల్మాన్ ఖాన్ గత సీజన్లతో పోలిస్తే ఈసారి రెమ్యునరేషన్ పెంచేశాడు. అదే సమయంలో, షో హోస్ట్ చేసిన తొలినాళ్లలో సల్మాన్  రెమ్యూనరేషన్‌గా దాదాపు 10 కోట్లు తీసుకునేవారు. అయితే  ఇప్పుడు దానిని రూ.150 కోట్లకు పెంచారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.