Shah Rukh Khan: పిల్లల కోసం కష్టపడుతోన్న షారూఖ్ ఖాన్.. స్పీడ్ పెంచేసిన బాద్‌షా.!

|

Jun 30, 2023 | 11:47 AM

బాలీవుడ్ బాద్‌ షా షారూఖ్ ఖాన్ స్కై హైలో ఉన్నారు. దాదాపు పదేళ్లుగా సక్సెస్‌కు దూరంగా ఉన్న కింగ్ ఖాన్‌.. ఈ మధ్యే బిగ్ హిట్‌తో బౌన్స్ బ్యాక్ అయ్యారు.

బాలీవుడ్ బాద్‌ షా షారూఖ్ ఖాన్ స్కై హైలో ఉన్నారు. దాదాపు పదేళ్లుగా సక్సెస్‌కు దూరంగా ఉన్న కింగ్ ఖాన్‌.. ఈ మధ్యే బిగ్ హిట్‌తో బౌన్స్ బ్యాక్ అయ్యారు. తాజాగా వారసుల విషయంలోనూ షారూఖ్‌ స్పీడు పెంచారు. తను మంచి ఫామ్‌లో ఉండగానే పిల్లలను సెటిల్ చేయాలని ఫిక్స్ అయ్యారు. గత ఏడాది షారూఖ్ లైఫ్‌లో బ్యాడ్ ఇయర్‌. అసలే సక్సెస్‌లు లేక కష్టాల్లో ఉన్న బాద్‌ షా లాస్ట్ ఇయర్ ఫ్యామిలీ విషయంలోనూ చాలా ఇబ్బందులు పడ్డారు. కొడుకు ఆర్యన్‌ ఖాన్‌ డ్రగ్స్ కేసులో చిక్కుకోవటంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కొద్ది రోజుల పాటు షూటింగ్స్‌కు కూడా బ్రేక్‌ ఇచ్చి ఇంటికే పరిమితమయ్యారు.

ఇప్పుడు పరిస్థితి వేరు. ప్రజెంట్ ప్రొఫెషనల్‌గా, పర్సనల్‌గా స్కై హైలో ఉన్నారు బాద్‌షా. పఠాన్ సినిమాతో వెయ్యి కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన షారూఖ్‌, ఆ మధ్య కొడుకు డైరెక్షన్‌లోనే నటించి ఆ హ్యాపీనెస్‌ను అందరితో షేర్ చేసుకున్నారు. ఆర్యన్ డైరెక్ట్ చేసిన ఓ యాడ్ ఫిలింలో షారూఖ్‌ నటించటం బాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయ్యింది. ఆర్యన్ బాలీవుడ్ ఎంట్రీ విషయంలో చాలా కాలంగా చర్చ జరుగుతోంది. అయితే ఈ స్టార్ కిడ్ మాత్రం ఆన్‌ స్క్రీన్ కన్నా ఆఫ్‌ స్క్రీన్ మీదే ఎక్కువగా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే హోం బ్యానర్‌లో ఆర్యన్ డైరెక్షన్‌లో వెబ్ సిరీస్‌ ఎనౌన్స్‌ అయ్యింది. అంతకన్నా ముందే తండ్రితో ఓ యాడ్‌ ఫిలిం రూపొందించారు ఆర్యన్‌ ఖాన్‌.

ఇప్పుడు కూతురు కెరీర్‌ మీద దృష్టి పెట్టారు బాద్‌షా. స్టార్‌ కిడ్స్‌ను ఇంట్రడ్యూస్‌ చేస్తూ రూపొందిస్తున్న ‘ది ఆర్చీస్’తో సుహానా కూడా ఓటీటీ అరంగేట్రం చేస్తున్నారు. నెక్ట్స్‌ సుహానాను వెండితెరకు పరిచయం చేసే బాధ్యతను షారూఖ్‌ స్వయంగా తీసుకుంటున్నారు. సుహాన లీడ్‌ రోల్‌లో తన సొంత బ్యానర్‌లో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు షారూఖ్‌, అంతేకాదు ఆ సినిమాలో కింగ్ ఖాన్‌ గెస్ట్‌ రోల్‌లో కనిపించబోతున్నారు. ఈ సినిమాతో సుహానాకు బాలీవుడ్‌లో రెడ్ కార్పెట్‌ వేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు.

(టీవీ9 ఎంటర్టైన్మెంట్ డెస్క్)