Akshay Kumar: కన్నప్ప కోసం అక్షయ్‌ ఎన్ని కోట్లు అందుకుంటున్నాడో తెలుసా.?

|

May 06, 2024 | 8:38 AM

ఇటీవలే విడుదలైన ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇదే తరహాలో కన్నప్ప సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కన్నప్ప సినిమాలో చాలా మంది నటీ నటులు కనిపించనున్నారు.

Akshay Kumar: కన్నప్ప కోసం అక్షయ్‌ ఎన్ని కోట్లు అందుకుంటున్నాడో తెలుసా.?
Kannappa
Follow us on

మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా కన్నప్ప. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. జిన్నా సినిమా తర్వాత మంచు విష్ణు నటిస్తున్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మధ్యకాలంలో ఫాంటసీ సినిమాల హవా నడుస్తుంది. ఇటీవలే విడుదలైన ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇదే తరహాలో కన్నప్ప సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కన్నప్ప సినిమాలో చాలా మంది నటీ నటులు కనిపించనున్నారు.

ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుండటంతో ఈ సినిమాలో బాలీవుడ్, కోలీవుడ్ కు సంబందించిన నటులు కూడా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాలో సెట్ లోకి అడుగు పెట్టారు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్. కన్నప్ప సినిమాలో అక్షయ్ కుమార్ శివుడిగా కనిపించనున్నారని తెలుస్తోంది. మొదటోలో శివుడి పాత్రకు రెబల్ స్టార్ ప్రభాస్ ను అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన స్థానంలోకి అక్షయ్ వచ్చారు. కానీ ప్రభాస్ ఈ సినిమాలో కీలక ఓపాత్రలో కనిపిస్తారని అంటున్నారు.

అక్షయ్, ప్రభాస్ తో పాటు మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం అక్షయ్ కుమార్ భారీగా రెమ్యునరేషన్ అందుకుంటున్నడని తెలుస్తోంది. 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అక్షయ్ కు ఏకంగా రూ. 6 కోట్లు రెమ్యునరేషన్ అందుకుంటున్నారని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో నయన తార కూడా నటిస్తుంది. ఈ మూవీలో నయన్ పార్వతిగా నటిస్తుందని టాక్. ఇప్పటికే ఈ సినిమానుంచి విష్ణు పోస్టర్ ను రిలీజ్ చేశారు. త్వరలోనే ఈ సినిమాలోని టీజర్ రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.