సెలబ్రిటీలు పెళ్లిళ్ల గురించి, ప్రగ్నెన్సీల గురించి సోషల్ మీడియాలో నిత్యం వందల రూమర్స్ చక్కర్లు కొడుతుంటాయి.సెలబ్రిటీలు పెళ్లి చేసుకోకముందు కొన్ని రూమర్స్, పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రూమర్స్ వాస్తు ఉంటాయి. తాజాగా ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కత్రినా కైఫ్ ఇప్పుడు ప్రెగ్నెంట్ అంటూ కొన్ని వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ మధ్య కత్రినా ప్రెగ్నెన్సీ పై చాలా వార్తలు వచ్చాయి. దీని పై కత్రినా కానీ విక్కీ కానీ స్పందించలేదు. తాజాగా కత్రినాకు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె గర్భవతి అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.
కత్రినా, విక్కీ ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. లండన్ రోడ్డులో ఈ ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. అక్కడ చాలా మందికి తెలియదు కాబట్టి ఈ జంట స్వేచ్ఛగా తిరుగుతూ కనిపించారు. అయితే, కొందరు కత్రినా, విక్కీ కలిసి తిరుగుతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో కత్రినా కైఫ్ బ్లాక్ బ్లేజర్ ధరించి కనిపించింది. అలాగే ఆమె కడుపు భాగం ఎత్తుగా కనిపిస్తోంది. దాంతో కత్రినా ప్రెగ్నెంట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోపై అభిమానులు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ‘కత్రినా కైఫ్ గర్భవతి’ అని కొందరు అన్నారు. కొంతమంది అది కత్రినా కాదు అని అంటున్నారు.
కత్రినా కైఫ్ మరియు విక్కీ కౌశల్ బిడ్డకు జన్మనివ్వనున్నారని ఈ మధ్య వార్తలు పుట్టుకొచ్చాయి. దానికి కారణం కూడా ఉంది. ‘మెర్రీ క్రిస్మస్’ తర్వాత కత్రినా కైఫ్ కొత్త సినిమా ఏదీ ప్రకటించలేదు. దాంతో కత్రినా ప్రగ్నెంట్ అని అందుకే సినిమాలకు గ్యాప్ ఇచ్చిందని అంటున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. త్వరలోనే ఈ విషయం పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
The humble Bollywood power couple #KatrinaKaif & #VickyKaushal taking a stroll in Baker Street, London. Vicky is a gentleman clearly, as he holds his hand protectively by her side. This was post bumping into them at the bookstore yesterday. pic.twitter.com/7OUXCVaL9E
— HermanGomes_journo (@Herman_Gomes) May 20, 2024
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…