Surveen Chawla: సెండాఫ్ ఇవ్వడానికి వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు.. సౌత్ డైరెక్టర్ పై హీరోయిన్ సంచలన కామెంట్స్..

సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు మరోసారి తెరపైకి వచ్చాయి. తనకూ కాస్టింగ్ కౌచ్‌ అనుభవం ఎదురైందంటూ బాలీవుడ్ న‌టి సుర్వీన్ చావ్లా చేసిన సంచలన కామెంట్స్‌ కాక రేపుతున్నాయి. నేష‌న‌ల్ అవార్డు విన్నర్ అయిన ఓ త‌మిళ ద‌ర్శకుడు.. క‌మిట్‌మెంట్ అడిగి లైంగికంగా వేధించారని సుర్వీన్‌ చావ్లా ఆరోపించడం ప్రకంపనలు సృష్టిస్తోంది.

Surveen Chawla: సెండాఫ్ ఇవ్వడానికి వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు.. సౌత్ డైరెక్టర్ పై హీరోయిన్ సంచలన కామెంట్స్..
Surveen Chawla

Updated on: Jun 01, 2025 | 7:42 AM

కాస్టింగ్ కౌచ్‌.. కాస్టింగ్ కౌచ్‌.. కాస్టింగ్ కౌచ్‌.. సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించే ఈ పదం.. ఇప్పుడు మరోమారు సంచలనానికి కేంద్ర బిందువుగా అవుతోంది. సినిమాల్లో అవకాశాల కోసం కాస్టింగ్ కౌచ్‌ అనుభవం ఎదురైనట్లు ఇటీవల వరుసగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే.. తానూ కాస్టింగ్ బారిన పడ్డానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్‌ నటి సుర్వీన్ చావ్లా. రానానాయుడు సీజ‌న్-2 ప్రమోష‌న్‌లో భాగంగా.. ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న సుర్వీన్ చావ్లా.. కాస్టింగ్ కౌచ్ అనుభ‌వాలు గురించి చెప్పుకొచ్చారు. ఓ త‌మిళ‌ మూవీ ఆడిషన్ కోసం చెన్నై వెళ్లినప్పుడు నేషనల్‌ అవార్డ్‌ గ్రహీత అయిన ఆ సినిమా ద‌ర్శకుడు మధ్యవర్తి ద్వారా కమిట్‌మెంట్‌ గురించి అడిగారంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు.

ఒకట్రెండు సార్లు కాదు.. 20సార్లు ఎదురైన కాస్టింగ్ కౌచ్‌ పరిస్థితులతో షాకయ్యా అన్నారు బాలీవుడ్‌ నటి సుర్వీన్‌ చావ్లా. ముంబైలోనూ మరో సంఘ‌ట‌న జ‌రిగింద‌ని గుర్తు చేశారు. ఒక హిందీ సినిమా చేస్తున్న స‌మ‌యంలో డైరెక్టర్‌తో మీటింగ్‌ తర్వాత సెండాఫ్‌ ఇచ్చే సమయంలో అసభ్యంగా ప్రవర్తించినట్లు చెప్పారు. మీటింగ్‌లో వివాహం గురించి ఆరా తీసిన డైరెక్టర్‌.. మీటింగ్‌ తర్వాత ఇంటికి వెళ్లేటప్పుడు దగ్గరగా వచ్చి తనవైపు వంగి ముద్దు పెట్టేందుకు ప్రయత్నించారని.. దాంతో షాకై అతన్ని వెనక్కి నెట్టి వేసినట్లు తెలిపారు. దాంతో.. ఆ డైరెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు తీవ్రంగా ప్రశ్నించానని..అయినప్పటికీ గేటు వరకు వచ్చారని అప్పటి సంఘటన గురించి వివరించారు. ఇలాంటి ఘటనలు ఎంతో బాధించాయని.. అయితే.. ఎన్నిసార్లు కాస్టింగ్ కౌచ్‌ పరిస్థితులు ఎదురైనా ఎప్పుడూ లొంగిపోలేదని.. ధైర్యంగా వ్యవహరించానని సుర్వీన్‌ చావ్లా స్పష్టం చేశారు.

పలుమార్లు ఆడిషన్స్‌లో బాడీ షేమింగ్‌కు గురైనట్లు చెప్పారు. సినీ ఇండస్ట్రీలో మహిళలను తక్కువగా చూస్తారని.. ఫలితంగా మహిళలు తమను తాము తక్కువగా భావిస్తుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక.. ఆయా దర్శకుల పేర్లను ఆమె రివీల్‌ చేయకపోవడంతో వారెవరనేది అటు బాలీవుడ్‌లోనూ.. ఇటు కోలీవుడ్‌లోనూ తీవ్ర చర్చకు దారితీస్తోంది. మొత్తంగా.. బాలీవుడ్‌ నటి సుర్వీన్‌ చావ్లా కాస్టింగ్‌ కౌచ్‌ కామెంట్స్‌ సినీ ఇండస్ట్రీలో మరోసారి కాక రేపుతున్నాయి.

ఇవి కూడా చదవండి :  

OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..

Nagarjuna: టాలీవుడ్‏ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..

Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..

OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..