సాధారణంగా హీరోయిన్ల కంటే హీరోల దగ్గర కార్లు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లోని చాలా మంది హీరోల వద్ద చాలా ఖరీదైన లగ్జరీ అండ్ స్పోర్ట్స్ కార్లు ఉన్నాయి. అదే సమయంలో హీరోయిన్లు ఇలాంటి లగ్జరీ కార్లపై పెద్దగా ఆసక్తి చూపరు. అయితే బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఈ బ్యూటీకి కార్లంటే విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పటికే శ్రద్ధా గ్యారేజ్ లో పలు ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో లగ్జరీ కారు చేరింది. తాజాగా శ్రద్ధా కపూర్ ఖరీదైన లెక్సస్ LM 350h 4-సీట్ల కారును కొనుగోలు చేసింది. శ్రద్ధా కపూర్ దగ్గర ఇప్పటికే 4 కోట్ల రూపాయల విలువైన లంబోర్గిని హురాకాన్ టెక్నికా కారు ఉంది. 2023 లో దీనిని కొనుగోలు చేసింది. ఈ కారు నడుపుతూ ముంబై వీధుల్లో పలు సార్లు మీడియా కంట పడింది శ్రద్ధా కపూర్. ఇప్పుడు ఆమె మరో కొత్త లగ్జరీ కారును కొనుగోలు చేసింది. దీని విలువ కూడా సుమారు 3 కోట్ల రూపాయలు.
శ్రద్ధా కొనుగోలు చేసిన ఈ ఖరీదైన లెక్సస్ కారు చాలా పొడవుగా ఉన్నప్పటికీ, ఇందులో నలుగురు మాత్రమే కూర్చోగలరు. కారు వెనుక భాగంలో విలాసవంతమైన ఏర్పాట్లు ఉన్నందున నలుగురు మాత్రమే కూర్చోగలరు. వెనుక భాగంలో రిక్లైనర్ సీటు అమరిక ఉంది. దీనికి 48 అంగుళాల డిస్ ప్లే ఉంది. ఈ కారులో సన్‌రూఫ్, ఫ్రిజ్ కూడా ఉన్నాయి. 2487 సిసి ఇంజిన్ కలిగిన ఈ కారు పెట్రోల్ వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది. దీనికి ఆటోమేటిక్ గేరింగ్ సిస్టమ్ ఉంది. ఈ కారుకు 752 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. ఇలాంటి కార్లు ఇప్పటికే జాన్వీ కపూర్, రణబీర్ కపూర్ మొదలైన నటీనటుల ఇళ్లల్లో ఉన్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.