Tollywood: 16 ఏళ్లకే హీరోయిన్.. 21 ఏళ్లకే తల్లి.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. ఎవరంటే..

|

Oct 26, 2024 | 12:48 PM

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె ఒకప్పుడు క్రేజీ హీరోయిన్. 16 ఏళ్ల వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టి వెండితెరపై మాయ చేసింది. స్టార్ హీరోలతో కలిసి నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆ హీరోయిన్ వయసు 50 సంవత్సరాలు. ఇప్పటికీ ఏమాత్రం తగ్గని అందం, ఫిట్నెస్ తో హీరోయిన్లకు పోటి ఇస్తుంది.

Tollywood: 16 ఏళ్లకే హీరోయిన్.. 21 ఏళ్లకే తల్లి.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. ఎవరంటే..
Raveena
Follow us on

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ రవీనా టాండన్. స్టార్ హీరోలతో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆమె వయసు 50 సంవత్సరాలు. ఈరోజు ఈ బ్యూటీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, అభిమానులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. రవీనా 1974 అక్టోబర్ 26న జన్మించింది. 1991లో సల్మాన్ ఖాన్‌తో ‘పత్తర్ కే ఫూల్’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాతో నటిగా ప్రశంసలు అందుకున్న రవీనా.. ఆ తర్వాత గోవింద, అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి వంటి హీరోలతో కలిసి నటించింది. రవీనా టాండన్ 2004లో అనిల్ తడానిని వివాహం చేసుకుంది.

‘ఉపేంద్ర’ సినిమా ద్వారా కన్నడలోకి అడుగుపెట్టిన రవీనా.. ఆ తర్వాత దక్షిణాదిలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. చాలా కాలం తర్వాత కేజీఎఫ్ 2 చిత్రంలో కీలకపాత్ర పోషించింది. ఇందులో రమిక సేన్ అనే పాత్రలో నటించింది. రవీనా టాండన్ 16 ఏళ్ల వయసులో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత చదువుపై ఫోకస్ పెట్టి కాలేజీ విద్యాను పూర్తి చేయాలనుకుంది. కానీ అంతనలోనే తనకు సినిమా ఆఫర్ రావడంతో కాలేజీ విద్యను మధ్యలోనే వదిలేసింది. రవీనా 21 ఏళ్ల వయసులో ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకుంది. పిల్లలను దత్తత తీసుకునే సమయానికి ఇంకా ఆమెకు వివాహం కాలేదు.

రవీనా టాండన్, అజయ్ దేవగన్ క్లాస్‌మేట్స్. ముంబై కాలేజీలో కలిసి చదువుకున్నారు. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే హీరో అక్షయ్ కుమార్, రవీనా ప్రేమలో పడ్డారు. వీరిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ అనుహ్యంగా వీరిద్దరూ విడిపోయారు. ఇదిలా ఉంటే.. రవీనా దత్తత తీసుకున్న కూతురు ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. రవీనా పేరు వెనుక ఒక ఆశ్చర్యకరమైన కథ ఉంది. తండ్రి పేరు రవి టాండన్. తల్లి పేరు వీణ. ఇద్దరి పేర్లను కలిపి రవీనా అని పెట్టారు.

ఇది చదవండి :  Ram Charan: అప్పుడేమో క్యూట్‏గా.. ఇప్పుడేమో హాట్‏గా.. చరణ్ చెల్లిగా నటించిన ఈ బ్యూటీని ఇప్పుడు చూస్తే..

Tollywood: ఒక్క సినిమాతోనే సెన్సెషన్ అయిన నీలికళ్ల సుందరి.. అదృష్టం కలిసిరాని వయ్యారి.. ఎవరంటే..

Nadhiya : ద్యావుడా.. అందంలో తల్లిని మించిపోయిన కూతుళ్లు.. నదియా డాటర్స్ ఎంత అందంగా ఉన్నారో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.