Kalki 2898 AD 2: ‘కల్కి 2’లో ఈ స్టార్ హీరోయిన్ ఫిక్స్! దీపిక ప్లేస్ లో ఎవరు రానున్నారంటే?

ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మైథలాజికల్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా చేసింది. అయితే ఇప్పుడీ సినిమా సీక్వెల్ లో దీపిక నటించడం లేదు. దీంతో ఆమె ప్లేస్ లో..

Kalki 2898 AD 2: కల్కి 2లో ఈ స్టార్ హీరోయిన్ ఫిక్స్! దీపిక ప్లేస్ లో ఎవరు రానున్నారంటే?
Kalki 2898 AD 2

Updated on: Dec 04, 2025 | 6:27 AM

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా సీక్వెల్ లో ఈ బ్యూటీ నటించడం లేదు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు ఈ సీక్వెల్ కోసం బాలీవుడ్ కే చెందిన మరో స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలని చిత్ర బృందం ప్రణాళికలు రచిస్తోందని తెలుస్తోంది. ‘కల్కి 2898 AD’ కథ లో దీపిక పాత్ర చాలా కీలకం. రెండో పార్ట్ లో కూడా ఈ పాత్రకు చాలా ప్రాధాన్యముంటుందని తెలుస్తోంది. అయితే అనూహ్యంగా ఈ క్రేజీ సీక్వెల్ నుంచి దీపిక తప్పుకుంది. మొదట ప్రభాస్ ‘స్పిరిట్’ నుంచి బయటకు వచ్చిన ఈ బాలీవుడ్ బ్యూటీ ఆ తర్వాత ‘కల్కి 2898 AD’ సీక్వెల్ నుంచి కూడా తప్పుకుంది. వీటన్నింటికీ కారణం ఏమిటనే దానిపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరిగింది. తాను 8 గంటలు మాత్రమే షూటింగ్ లో ఉంటానని చెప్పడం తోనే దీపికను తప్పించారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు దీపిక ప్లేస్ లో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాను హీరోయిన్ గా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.

నిక్ జోనాస్‌ను వివాహం చేసుకున్న తర్వాత ప్రియాంక చోప్రా విదేశాల్లోనే స్థిరపడిపోయింది. ఎక్కువగా హాలీవుడ్ సినిమాల్లోనే నటించింది. కానీ ఇప్పుడు ఆమె తిరిగి భారతీయ చిత్ర పరిశ్రమకు వచ్చింది. మహేష్ బాబు- రాజమౌళి కాంబినేషన్ లో వస్తోన్న ‘వారణాసి’ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఇందుకు గానూ ఆమెకు భారీ పారితోషికం కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోది.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు కల్కి సీక్వెల్ లో కూడా ప్రియాంకను తీసుకోవాలని చిత్ర బృందం ఆలోచిస్తోంది. . ‘కల్కి 2898 AD’ సీక్వెల్ షూటింగ్ ఎక్కువ భాగం స్టూడియోలోనే జరుగుతుంది. ఈ విషయం గురించి ప్రియాంకను ఒప్పించాలని బృందం నిర్ణయించుకుంది. ఈ సినిమా షూటింగ్ కోసం ఆమె హైదరాబాద్ రావాల్సి ఉంటుంది. త్వరలోనే ప్రియాంక ఎంపికను అధికారికంగా ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.