Nora Fatehi: అమ్మకు తెలియకుండా ఆ పని.. చెప్పుదెబ్బలు తిన్నాను.. హాట్ బ్యూటీ కామెంట్స్

బాలీవుడ్ ముద్దుగుమ్మల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ నోరా ఫతేహి(Nora Fatehi). స్పెషల్ సాంగ్స్ కు ఈ అమ్మడు పెట్టింది పేరు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ చిన్నది సుపరిచితురాలే..

Nora Fatehi: అమ్మకు తెలియకుండా ఆ పని.. చెప్పుదెబ్బలు తిన్నాను.. హాట్ బ్యూటీ కామెంట్స్
Nora Fatehi

Updated on: Sep 20, 2022 | 10:32 AM

బాలీవుడ్ ముద్దుగుమ్మల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ నోరా ఫతేహి(Nora Fatehi). స్పెషల్ సాంగ్స్ కు ఈ అమ్మడు పెట్టింది పేరు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ చిన్నది సుపరిచితురాలే.. పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో స్టెప్పులేసి ఉర్రుతలూగించింది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే సినిమాల్లో ఇండస్ట్రీలో రాణించాలంటే అంతా ఈజీ కాదు. ఎంతో కష్టపడితే కానీ సక్సెస్ అవ్వలేరు.. అలాగే ఈ అమ్మడు కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొంటే తప్ప బాలీవుడ్ లో నిలబడిందట. నోరా బెస్ట్ డాన్సర్.. ఈ విషయాన్నీ ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. స్పెషల్ సాంగ్స్ లో ఈ అమ్మడి డాన్స్ కు ఫిదా కానీ వారంటూ ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. మొదట ఐటెం సాంగ్స్ లో నర్తించిన ఈ బ్యూటీ ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ వస్తోంది. తెలుగులో అఖిల్ మిస్టర్ మజ్ను, చరణ్ ధ్రువ సినిమాలో నటించింది నోరా..

ఇక టెంపర్’, ‘బాహుబలి’,’కిక్ 2′ వంటి సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసిన ఈ భామ ఇప్పుడు బాలీవుడ్లో బెస్ట్ డాన్సర్ గా రాణిస్తుంది. అక్కడ స్పెషల్ ఆల్బమ్స్ చేస్తూ దూసుకుపోతోంది. తాజాగా ఈ అమ్మడు మాట్లాడుతూ.. నాకు చిన్నప్పటి నుండి డాన్స్ అంటే చాలా ఇష్టం.  పెద్ద డాన్సర్ అవాలని కళలు కనేదాన్ని. కానీ నా తల్లిదండ్రులకు అది ఇష్టం లేదు. నన్ను మంచిగా చదువుకోమనేవారు. కానీ నేను డాన్స్ పైనే ఎక్కువ ద్రుష్టి పెట్టాను. ఒకసారి డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ మా అమ్మకు దొరిగిపోయాను. దాంతో ఆమె కోపం ఆపుకోలేక చెప్పు తో నన్ను కొట్టింది. అలా డాన్స్ కోసం చెప్పుదెబ్బలు తిన్నాను అంటూ చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి