Actress : అడిషన్స్ అని పిలిచి ఆ డైరెక్టర్ బికినిలో కూర్చోమన్నాడు.. హీరోయిన్ సంచలన కామెంట్స్..

సినీరంగంలో హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభమేమి కాదు. ఎన్నో సవాళ్లు, విమర్శలు ఎదుర్కొని నిలబడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇండస్ట్రీలో హీరోయిన్స్ క్యాస్టింగ్ కౌచ్ వేధింపులు ఎదురైన సందర్భాలు ఎక్కువే. చాలా కాలం ఎంతో మంది తారలు ఈ ఇబ్బందులపై స్పందించారు. ఇప్పుడు ఓ హీరోయిన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Actress : అడిషన్స్ అని పిలిచి ఆ డైరెక్టర్ బికినిలో కూర్చోమన్నాడు.. హీరోయిన్ సంచలన కామెంట్స్..
Navina Bole

Updated on: Dec 04, 2025 | 10:25 AM

చిత్రపరిశ్రమలో హీరోయిన్లుగా నిలదొక్కుకోవడం అంత సులభమైన పని కాదు. నటిగా తమకంటూ ఓ గుర్తింపు కోసం అనేక అవమానాలు, సవాళ్లు దాటుకుని వచ్చినవారు చాలా మంది ఉన్నారు. స్టార్ డమ్ కోసం వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నటీమణులుగా సక్సెస్ అయిన తారలు ఉన్నారు. ఈ క్రమంలోనే ఎన్నో చేదు అనుభవాలను కూడా దాటుకుని రావాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ తమకు ఎదురైన చేదు అనుభవాలను వెల్లడించారు. ఇప్పుడు ఓ హీరోయిన్ చేసిన కామెంట్స్ మరోసారి నెట్టింట వైరల్ గా మారాయి. ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ హీరోయిన్ నవీనా బోలే. కెరీర్ ప్రారంభంలో తనకు ఎదురైన అనుభవాన్ని గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తనతో ఓ డైరెక్టర్ ఎలా ప్రవర్తిండాడు.. సినిమా ఛాన్స్ అని పిలిచి అతడు తనతో ఎలా మాట్లాడాడు అనే విషయాలను బయటపెట్టింది.

ఇవి కూడా చదవండి :  Maheshwari : పెళ్లి సినిమా హీరోయిన్ గుర్తుందా.. ? ఆమె కూతురు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్స్..

నవీనా బోలే మాట్లాడుతూ.. “నా జీవితంలో నేను ఎప్పుడూ కలవడానికి ఇష్టపడని చాలా భయంకరమైన వ్యక్తి ఉన్నాడు. అతడు ఒక పాపులర్ దర్శకుడు. అతను మనలో చాలా మందిని వెంటాడి, మహిళలను అవమానించే విషయంలో తీవ్రస్థాయికి వెళ్ళాడు. అతడు ఓ సినిమా అవకాశం కోసం నాకు ఫోన్ చేశాడు. నేను అడిషన్ కోసం వెళ్లినప్పుడు నన్ను బికినిలో కూర్చోవాలని చెప్పాడు. నువ్వు ఎంత కంఫర్టబుల్ గా ఉన్నావో చూడాలని అన్నాడు. వెంటనే అతడి సినిమా అవకాశాన్ని తిరస్కరించాను ” అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి : Actor : ఒకప్పుడు మామిడి కాయలు అమ్మాడు.. ఇండస్ట్రీలోనే టాప్ నటుడు.. ఒక్కో సినిమాకు కోట్ల రెమ్యునరేషన్..

ఒక సంవత్సరం తర్వాత మిసెస్ ఇండియాలో పాల్గొంటున్నప్పుడు ఆ దర్శకుడు తనను మళ్లీ సంప్రదించాడని తెలిపింది. “అతను మళ్ళీ నాకు ఫోన్ చేసి, ‘నువ్వు ఏం చేస్తావు, ఒక పాత్ర కోసం నన్ను కలవాలి’ అని అడిగాడు. ఈ వ్యక్తి చాలా మంది మహిళలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాడని నేను చెప్పాను, ఒక సంవత్సరం క్రితం అతను నన్ను తన ఇంటికి ఆహ్వానించాడని, ఇప్పటికే నాతో చాలా దారుణంగా ప్రవర్తించాడని అతనికి గుర్తులేదు” అని తెలిపింది. దీంతో ఇప్పుడు నవీనా చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నవీనా బోలే బాలీవుడ్ ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ కర్రన్ జీత్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ దంపతులు ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చారు. ఆ తర్వాత 7 ఏళ్లకు విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం నవీనా సింగిల్ గానే ఉంటోంది.

ఇవి కూడా చదవండి : Rajendra Prasad: మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్.. బ్రహ్మానందంపై అలాంటి మాటలా.. ?