Kareena Kapoor: 44 ఏళ్ల వయసులోనూ తగ్గని అందం.. కరీనా డైట్ సిక్రెట్ ఇదేనట..

ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్. అప్పట్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషన్ హీరోయిన్. షారుఖ్, సల్మాన్, హృతిక్ రోషన్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. దశాబ్దాలపాటు సినీరంగాన్ని ఏలేసిన ఈ అమ్మడు.. ఇప్పటికీ ఇండస్ట్రీలో రాణిస్తుంది. ప్రస్తుతం 44 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం తగ్గని అందంతో కట్టిపడేస్తుంది.

Kareena Kapoor: 44 ఏళ్ల వయసులోనూ తగ్గని అందం.. కరీనా డైట్ సిక్రెట్ ఇదేనట..
Kareena Kapoor

Updated on: Jun 04, 2025 | 12:44 PM

బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ గురించి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు అందం, అభినయంతో వెండితెరపై మాయ చేసింది. కపూర్ ఫ్యామిలీ నుంచి నటిగా అరంగేట్రం చేసిన ఈ అమ్మడు.. ఆనతి కాలంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. అగ్ర హీరోల జోడిగా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం కరీనా వయసు 44 సంవత్సరాలు. అయినప్పటికీ ఏమాత్రం తగ్గని అందంతో కుర్రహీరోయిన్లకు సైతం గుబులు పుట్టిస్తోంది. బీటౌన్ హీరో సైఫ్ అలీ ఖాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న కరీనా.. కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ఇప్పుడిప్పుడే సినీరంగంలోకి తిరిగి ఎంట్రీ ఇస్తుంది. తాజాగా కరీనా అందం, డైట్ సీక్రెట్ రివీల్ చేసింది. ఇంతకీ ఈ అమ్మడు ఫిట్నెస్ రహస్యం ఏంటో తెలుసా.. ? నోడ్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, కరీనా తన కెరీర్, వ్యక్తిగత జీవితం, ఫిట్‌నెస్ గురించి వెల్లడించింది.

కరీనా వ్యాయామానికి చాలా ప్రాధాన్యత ఇస్తుందని చెప్పింది. ముఖ్యంగా ఇద్దరు పిల్లల తల్లి అయిన తర్వాత ఇటీవలి సంవత్సరాలలో తన దినచర్యలో చేసిన మార్పులు చేసినట్లు తెలిపింది. సాయంత్రం 6 గంటలకు డిన్నర్ చేస్తానని, అలాగే రాత్రి 9.30 గంటలకు నిద్రపోతానని తెలిపింది. ఉదయం త్వరగా వ్యాయామం చేస్తానని, పార్టీలకు దూరంగా ఉంటానని చెప్పుకొచ్చింది. వ్యాయామం విషయంలో తాను రాజీ పడనని.. వ్యాయామం మానసిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా.. ఫిట్నెస్ కాపాడుకోవడానికి సహాయపడుతుందని తెలిపింది. కోవిడ్ తర్వాత ఫిట్నెస్ పై మరింత దృష్టి పెట్టినట్లు చెప్పుకొచ్చింది.

కరీనా మాత్రమే కాదు.. సాయంత్రం త్వరగా భోజనం చేసే అలవాటు ఉన్న సెలబ్రెటీస్ చాలా మంది ఉన్నారు. విరాట్ కోహ్లీ సతీమణి హీరోయిన్ అనుష్క శర్మ సైతం సాయంత్రం 6 గంటలకే డిన్నర్ చేస్తానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అలాగే జెనీలియా సైతం ఇటీవల తన డైట్ సీక్రెట్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి :  

Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..

Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..