Kangana Ranaut : తమిళ రాజకీయాలపై కంగనా సంచలన కామెంట్స్.. ఏం చెప్పారంటే.?

సినీ నటి, దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘తలైవి’. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కంగన రనౌత్ జయలలిత పాత్ర పోషిస్తుండగా..

Kangana Ranaut : తమిళ రాజకీయాలపై కంగనా సంచలన కామెంట్స్.. ఏం చెప్పారంటే.?
తలైవి గా చీరక‌ట్టులో మెరిసిన కంగనా రనౌత్.

Updated on: Sep 06, 2021 | 10:45 AM

Kangana Ranaut : సినీ నటి, దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘తలైవి’. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కంగన రనౌత్ జయలలిత పాత్ర పోషిస్తుండగా.. విలక్షణ నటుడు అరవింద్ స్వామి ఎంజీఆర్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఈ సినిమాకు ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తున్నారు. ‘తలైవి’ సినిమాను తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. విబ్రి మీడియా, కర్మ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి జీవీ ప్రకాష్ సంగీతాన్ని అందించాడు. ఇదిలా ఉంటే హైదరాబాద్ AMB మాల్‌లో తలైవి ప్రీమియర్ షో జరిగింది. తలైవి మూవీలో లీడ్ రోల్ చేస్తోన్న కంగనా రనౌత్‌తోపాటు పలువురు ప్రముఖులు ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా కంగనా మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత హైదరాబాద్‌కి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు కంగనా. భాగ్యనగర వాతావరణం గొప్ప అనుభూతిని ఇచ్చిందన్నారు.

‘మా ప్రొడ్యూసర్ విష్ణు సార్‌కి ఎప్పటికీ గుర్తుంచుకునే బ్లాక్ బస్టర్ బర్త్ డే గిఫ్ట్ ఇదే అవుతుంది. నాకు తమిళం గురించి కానీ, ఇక్కడి రాజకీయాల గురించి కానీ ఏం తెలియదు. నేను ఈ పాత్రను పోషించగలను అని విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పినప్పుడు నేను నమ్మలేదు. కానీ ఇప్పుడు మాత్రం నాకే వింతగా అనిపిస్తోంది. విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ‘మూడు సంవత్సరాల క్రితం ఈ సినిమా కోసం స్టోరీ రాయమని అడగ్గానే ఓకే అన్నా. కంగనాను ఈ సినిమాలో తీసుకోవాలని చెప్పాను. ఆ కథ చెప్పినప్పుడు వారు వేరే హీరోయిన్‌ను అనుకున్నారు. కానీ నా మైండ్‌లోకి కంగనా వచ్చింది. కానీ ఆ విషయాన్ని అడిగేందుకు ఆమెను అప్రోచ్ అయ్యే వారు ఎవరు? ఒకవేళ ఆమెకు కథ నచ్చక పోతే మనల్ని బతకనివ్వదు. ఆమెకు కథ నచ్చింది. జయలలితగా కంగనా అదరగొట్టేసింది. ఈ సినిమా తర్వాత ఆమె టాప్ చైర్‌లో ఉంటుందని ముందే చెప్పా. అదే జరుగుతుంది అన్నారు విజయేంద్ర ప్రసాద్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kangana Ranaut Photos: ‘తలైవి’గా వస్తున్న ‘కంగనా రనౌత్’.. చీరకట్టులో మెరుపులు..

Bigg Boss5: బిగ్ బాస్ కలర్ ఫుల్ స్టార్ట్..కంటతడి పెట్టించిన నటరాజ్ మాస్టర్..ఎమోషనల్ ఎంట్రీ!

Pawan Kalyan- Mogulaiah photos: మరోసారి చాటుకున్న రీల్ భీమ్లా నాయక్ మంచి మనసు.. మొగులయ్యకు ఆర్థిక సాయం ఫొటోస్..