
బాలీవుడ్ హీరో రణ్‌దీప్ హుడా, నటి లిన్ లైశ్రామ్‌లు శనివారం (నవంబర్ 29న) తమ పెళ్లిరోజును సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడీ బాలీవుడ్ హీరో. తన భార్యకు వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ చెప్పాడు. ఇదే సందర్భంగా మరో శుభవార్త కూడా చెప్పాడీ హ్యాండ్సమ్ హీరో. తాను తండ్రి కాబోతున్నట్లు గుడ్ న్యూస్ చెప్పాడు. ప్రస్తుతం తన భార్య నటి లిన్ లైశ్రామ్ గర్భంతో ఉందని ప్రకటించాడు. దీంతో ఈ దంపతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తన భార్యతో కలిసి చెట్ల మధ్య చలి మంట కాచుకుంటున్న ఫొటోను షేర్ చేసిన రణ్‌దీప్ హుడా.. ‘రెండేళ్ల ప్రయాణం, ఇప్పుడు మా ఇంట్లోకి ఓ బుజ్జి పాపాయి రాబోతోంది’అని క్యాప్షన్ జోడించాడు. ప్రస్తుత రణ్ దీప్ హుడా షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. దీనిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, సినీ అభిమానులు, నెటిజన్లు ఈ సెలబ్రిటీ కపుల్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కాగా బాలీవుడ్ లో ట్యాలెంటెడ్ నటుడిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు రణ్ దీప్ హుడా. రిస్క్, లవ్ కిచిడీ, జన్నత్ 2, హీరోయిన్, మర్డర్ 3, హైవే, సుల్తాన్, లవ్ ఆజ్ కల్, భాగీ 2 తదితర సినిమాల్లో హీరోగా, సహాయక నటుడిగా యాక్ట్ చేశాడు. ఇక స్వతంత్ర వీర్ సావర్కర్ సినిమాలో లీడ్ రోల్ పోషించడంతో దర్శకుడిగా, నిర్మాతగానూ వ్యవహరించాడు. ఈ నటుడు తెలుగు ఆడియెన్స్ కు కూడా పరిచయమే. ఇటీవల గోపీచంద్ మలినేని తెరకెక్కించిన జాట్ సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు రణ్ దీప్. రణతుంగగా క్రూరత్వం పండించి తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు.
ఇక రణ్ దీప్ భార్య లిన్ లైశ్రామ్ విషయానికి వస్తే.. ఓం శాంతి ఓం, మేరీ కోమ్, ఉమ్రిక, రంగూన్ వంటి పలు సినిమాలు చేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.