Tollywood: ఏంటన్నా ఇలా మారిపోయావ్‌? 52 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్ బాడీతో టాలీవుడ్ హీరో.. ఫొటోస్ వైరల్

50 ఏళ్లు దాటితే చాలు చాలా మంది రెస్ట్ మోడ్ కు అలవాటు పడిపోతారు. పెద్దగా కష్టించే పనులు చేయరు. అయితే ఈ 52 ఏళ్ల టాలీవుడ్ హీరో లేటెస్ట్ గా సిక్స్ ప్యాక్ బాడీతో ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ హీరో ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

Tollywood: ఏంటన్నా ఇలా మారిపోయావ్‌? 52 ఏళ్ల  వయసులో సిక్స్ ప్యాక్ బాడీతో టాలీవుడ్ హీరో.. ఫొటోస్ వైరల్
Actor Sonu Sood

Updated on: Dec 18, 2025 | 8:45 PM

బాడీని ఫిట్ గా ఉంచుకోవడానికి సినిమా సెలబ్రిటీలు బాగా కష్టపడతారు. జిమ్ సెంటర్ లో గంటల కొద్దీ గడుపుతుంటారు. కఠినమైన వర్కవుట్లు చేస్తూ చెమటలు చిందిస్తుంటారు. అందుకే వయసు మీద పడినా అక్కినేని నాగార్జున లాంటి చాలా మంది హీరోలు యంగ్ గా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్చ పరుస్తుంటారు. అలా తాజాగా ఈ జాబితాలోకి మరో టాలీవుడ్ హీరో కూడా చేరాడు. ప్రస్తుతం ఆయన వయసు సుమారు 52 సంవత్సరాలు. తాజాగా ఈ హీరో సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు షేర్ చేశారు. జిమ్ సెంటర్ లో సిక్స్ ప్యాక్ బాడీని చూపిస్తూ కొన్ని ఫొటోలు అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలు క్షణాల్లోనే వైరల్ గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు ‘ ఈ వయసులో కూడా ఇంత ఫిట్నెస్’ అంటూ సదరు హీరోకు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఇంతకీ ఆయనెవరనుకుంటున్నారా? కేవలం సినిమాలే కాకుండా తన సామాజిక సేవా కార్యక్రమలతో తరచూ వార్తల్లో నిలుస్తోన్న సోనూసూద్ ఫొటోలే అవి.

 

ఇవి కూడా చదవండి

ఈ మధ్యన సినిమాల కంటే తన సేవా కార్యక్రమాలతోనే వార్తల్లో నిలుస్తున్నాడు సోనూ సూద్. ఇటీవలే ఆయన సుమారు 500 మందికి ఉచితంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. సోనూసూద్ చివరిగా ఫతే అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో హీరోగానే నటించడమే కాకుండా దర్శక నిర్మాతగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు సోనూసూద్. సైబర్ నేరాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. ఇక త్వరలోనే సోనూసూద్ కొత్త ప్రాజెక్టు గురించి అప్ డేట్స్ రానున్నాయి.

జిమ్ సెంటర్ లో సిక్స్ ప్యాక్ బాడీతో సోనూ సూద్..

500 మంది క్యాన్సర్ రోగులకు ఉచితంగా ట్రీట్మెంట్..

మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తోన్న నటుడు సోనూ సూద్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..