బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడిని కుటుంబసభ్యులు వెంటనే ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం సైఫ్ కు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ముంబై బాంద్రాలోని సైఫ్ ఇంట్లోకి ఒక దొంగ చొరబడ్డాడని సమాచారం. అదే సమయంలో అతడిని సైఫ్ అడ్డగించడంతో అతడిపై దొంగ దాడికి పాల్పడ్డాడని.. దీంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
ఇంట్లోకి దొంగ రావడంతో కొంతమంది సేవకులు నిద్ర నుంచి మేల్కొన్నారు. ఇంట్లో శబ్దం రావడంతో నిద్ర నుంచి మేల్కోన్న సైఫ్ బయటకు వచ్చి ఆ దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఇంతలో ఆ దొంగ సైఫ్ పై కాత్తితో దాడి చేసి అతడిని తీవ్రంగా గాయపరిచాడు. కాగా, ఘటన అనంతరం దొంగ పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు ముంబై పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ తీవ్రంగా గాలిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ భార్య, నటి కరీనా కపూర్ ఖాన్, వారి పిల్లలు క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు కేసుకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. ఇంటి చుట్టూ అమర్చిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో సైఫ్ అలీ ఖాన్ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సైఫ్.. ఇప్పుడు విలన్ గా కొత్త అవతారం ఎత్తాడు. డైరెక్టర్ ఓంరౌత్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో వచ్చిన ఆదిపురుష్ సినిమాలో రావణుడి పాత్రలో నటించారు సైఫ్. ఈ సినిమాతోనే సౌత్ అడియన్స్ ముందుకు వచ్చారు. ఆ తర్వాత గతేడాది సూపర్ హిట్ అయిన దేవర చిత్రంలో భైరా పాత్రలో కనిపించాడు. ఈ మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇప్పుడిప్పుడే చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు సైఫ్.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..