Saif Ali Khan: విదేశాల్లో లగ్జరీ విల్లాను కొన్న దేవర విలన్.. కారణమదేనా?

ముంబైలో కత్తిపోటు సంఘటన జరిగిన మూడు నెలల తర్వాత బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఒక విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశాడు. అది కూడా ముంబైలో కాదు.. ఖతార్‌లోని సెయింట్ రెగిస్ మార్సా అరేబియన్ ద్వీపంలో. దీనికి కారణమేంటో తెలుసా?

Saif Ali Khan: విదేశాల్లో లగ్జరీ విల్లాను కొన్న దేవర విలన్.. కారణమదేనా?
Saif Ali Khan

Updated on: Apr 22, 2025 | 7:17 PM

బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ కు ఆస్తులపై పెద్దగా ఆసక్తి లేదు. అతని పూర్వీకులకు సంబంధించే కోట్లాది రూపాయల ఆస్తులున్నాయి. అలాగే పటౌడీ ప్యాలెస్ తో పాటు బాంద్రా లో లగ్జరీ అపార్ట్ మెంట్ ఉంది. అయితే అదే బాంద్రా అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నప్పుడు సైఫ్ అలీఖాన్ పై దాడి జరిగింది. ఒక గుర్తు తెలియని దుండగులు అతని ఇంట్లోకి ప్రవేశించి సైఫ్ పై కత్తితో దాడి చేశాడు. ఈ ప్రమాదంలో నటుడికి తీవ్ర గాయాలయ్యాయి. చాలా రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స కూడా తీసుకున్నాడు. అయితే ఈ సంఘటన జరిగిన మూడు నెలల తర్వాత, సైఫ్ అలీ ఖాన్ కొత్త ఇల్లు కొన్నాడు. దీని గురించి ఆయనే సమాచారం ఇచ్చాడు. సైఫ్ అలీ ఖాన్ ముంబైలో ఇల్లు కొన్నారా? అంటే కాదు. ఖతార్‌ దేశంలోని సెయింట్ రెగిస్ మార్సా అరేబియన్ ద్వీపంలో ఒక లగ్జరీ ఇల్లును నటుడు కొనుగోలు చేశారు. సైఫ్ అలీ ఖాన్ సినిమా షూటింగుల నుంచి విరామం దొరికినప్పుడు ఎక్కువగా విదేశీ టూర్లకు వెళుతుంటాడు. భార్య కరీనా కపూర్, ఇద్దరు పిల్లలతో కలిసి వెకేషన్ లకు తరచూ వెళుతుంటాడు. అందులో ఎక్కువగా ఖతార్‌ను కూడా సందర్శిస్తాడు. ఈ కారణంగానే సైఫ్ ఇప్పుడు ఖతార్ లో ఇల్లు కొన్నాడు.

‘సెలవులకు వెళ్లాలని లేదా రెండవ ఇల్లు ఉండాలనే ఆలోచనతోనే నేను ఇక్కడ ఒక ఇల్లు కొన్నాను. ఇదేమీ చాలా దూరం కాదు. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది చాలా సురక్షితం. సినిమా షూటింగుల నుంచి గ్యాప్ దొరికినప్పుడు అక్కడ ఉండటం చాలా బాగుంది” అని సైఫ్ అన్నాడు.

ఇవి కూడా చదవండి

భార్య కరీనా కపూర్ తో సైఫ్ అలీఖాన్..

కత్తిపోటు సంఘటన తర్వాత సైఫ్ అలీ ఖాన్ మేల్కొన్నాడు. విదేశాలకు వెళ్ళేటప్పుడు హోటళ్లలో బస చేయడం కంటే సొంత ఇల్లు ఉంటే మంచిదని సైఫ్ నిర్ణయించుకున్నాడు. అందుకే ఆయన ఈ ఇంటిని కొన్నాడని తెలుస్తోంది. ఈ ఏడాది జనవరిలో సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. ఈ కారణంగా అతనికి వీపుపై శస్త్రచికిత్స కూడా జరిగింది. చాలా రోజుల పాటు ఇంటికే పరిమితమైన సైఫ్ ఇప్పుడిప్పుడే షూటింగుల్లో బిజీ అవుతున్నాడు.

ప్రధాని మోడీతో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.