
ప్రముఖ నటుడు సోనూసూద్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. తాజాగా గుజరాత్‌లోని వారాహి గోశాలను సందర్శించిన ఆయన అక్కడి ప్రజలు గోవులను సంరక్షిస్తున్న విధానం చూసి మురిసిపోయారు. మూగజీవాల పట్ల ప్రజలు చూపిస్తోన్న ప్రేమాభిమానాలను చూసి సంతోషం వ్యక్తం చేశాడు. ఇదే సందర్భంగా గోశాలలోని మూగజీవాల సంరక్షణ కోసం రూ.11 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ‘కేవలం కొద్ది ఆవులతో మొదలైన ఈ గోశాలలో ఇప్పుడు వాటి సంఖ్య 7000లకు చేరింది. ఇది నిజంగా చాలా గొప్ప విషయం.ఈ గ్రామంలోని ప్రజలందరూ గోవుల సంరక్షణ కోసం పాటుపడుతుండటం అభినందనీయం. వారు చేసినంత సేవ నేను చేయకపోవచ్చు. కానీ నా తరపున రూ.11 లక్షలు విరాళం ఇస్తున్నాను. దాని వల్ల వారి సేవలు మరింత విస్తృతం అవుతాయని అనుకుంటున్నాను. గోవుల పట్ల ఈ గ్రామ ప్రజలు చూపిస్తోన్న ప్రేమ నన్నెంతగానో కట్టిపడేసింది. ఇక్కడ ఆవులను సంరక్షిస్తున్న విధానాన్ని దేశమంతా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటి నుంచి వీలు కుదిరినప్పుడు తప్పకుండా ఇక్కడికి వస్తుంటాను’ అని అన్నాడు.
కాగా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నటుడిగా రాణిస్తున్నాడు రాణిస్తున్నాడు. విలన్ గానే కాకుండా డైరెక్టర్ గానూ, నిర్మాతగానూ సత్తా చాటుతున్నాడు. చివరగా ‘ఫతే’ అనే హిందీ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు సోనూసూద్. ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు నిర్మాతగానూ, దర్శకుడిగానూ సత్తా చాటాడు. దీని తర్వాతి ప్రాజెక్టు గురించి సోనూసూద్ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
They ask for nothing, only care.
Standing with our cows and cow shelter homes.
जय गौ माँ 🙏 pic.twitter.com/NHg0ZnXd5z— sonu sood (@SonuSood) January 11, 2026
కాగా కరోనా సమయం నుంచి సోనూసూద్ తరచూ ఇలాంటి మంచి పనులు చేస్తూనే ఉన్నారు. లాక్‌డౌన్ కాలంలో వలస కూలీలను తన సొంత ఖర్చులతో సొంతూళ్లకు పంపించడం ద్వారా రియల్ హీరోగా జనం హృదయాల్లో చోటు దక్కించుకున్నారు. ఆ తర్వాత నుంచి సోషల్ మీడియా వేదికగా తన దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తూ వారికి సాయం చేస్తున్నారు.
When life gives you sugarcane… crush it and chill.#supportsmallbusiness pic.twitter.com/vYtUcgegcm
— sonu sood (@SonuSood) December 31, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి