
సీతారామం సినిమాతో ఓవర్ నైట్ లో లైమ్ లైట్ లోకి వచ్చింది అందాల భామ మృణాల్ ఠాకూర్. సీరియల్ నుంచి సినిమాల్లోకి వచ్చిన మృణాల్ మొదట బాలీవుడ్ సినిమాలు చేసింది తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక టాలీవుడ్ లోకి అడుగుపెడుతూనే సీతారామంలాంటి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆతర్వాత నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమాతో మరో హిట్ అందుకుంది ఈ అందాల భామ. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ చిన్నదని స్పీడ్ కు ఫ్యామిలీ స్టార్ బ్రేక్ వేసింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.. దాంతో ఈ చిన్నది సినిమాల స్పీడ్ తగ్గించింది. ప్రస్తుతం ఆచితూచి సినిమాలు చేస్తుంది ఈ భామ.
ఇదిలా ఉంటే తాజాగా మృణాల్ ఠాకూర్ ఓ వివాదంలో చిక్కుకుంది. గతంలో ఓ స్టార్ హీరోయిన్ పై ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదాన్ని రేపాయి. ఓఇంటర్వ్యూలో మృణాల్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ బిపాసా బసు పై షాకింగ్ కామెంట్స్ చేసింది. బిపాసా కంటే తాను అందంగా ఉంటాను అని.. ఆమె శరీరం కండలు తిరిగి మగరాయుడిలా ఉంటుందని మృణాల్ చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ వైరల్ అవ్వడంతో మృణాల్ పై కొందరు విమర్శలు కురిపించారు. ఈ క్రమంలోనే తాజాగా బిపాసా మృణాల్ కు కౌంటర్ ఇచ్చింది.
మహిళల గురించి బిపాసా బసు ఓ కొటేషన్ రాసుకొచ్చింది. ” బలమైన మహిళలు ఎప్పుడూ కూడా ఒకరి కోసం మరొకరు కృషి చేస్తారు. నిజానికి మహిళలంతా చాలా స్ట్రాంగ్‌గా, బలంగా ఉండాలి. అప్పుడే వారు మెంటల్ గా అటు ఫిజికల్ గా ఆరోగ్యంగా ఉంటారు. అమ్మాయిలు బలంగా కనిపించకూడదు అనే పాతకాలపు ఆలోచనల నుండి బయటకు రండి అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అయితే ఈ కౌంటర్ మృణాల్‌కేనని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి బిపాసా బసు కౌంటర్ పై మృణాల్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ ఇద్దరు ముద్దుగుమ్మల మధ్య మాటల యుధం ఎప్పుడు ముగుస్తోందా అని కొంతమంది ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి