AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Divvala Madhuri: దివ్వెల మాధురి ప్రతి నెలా ఎంత బంగారం కొంటుందో తెలుసా? స్వయంగా చెప్పిన బిగ్‌బాస్ కంటెస్టెంట్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసిన దివ్వెల మాధురి తాజాగా ఓ టాక్ షో హాజరైంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇదే క్రమంలో తన ఆస్తుల గురించి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

Divvala Madhuri: దివ్వెల మాధురి ప్రతి నెలా ఎంత బంగారం కొంటుందో తెలుసా? స్వయంగా చెప్పిన బిగ్‌బాస్ కంటెస్టెంట్
Divvala Madhuri
Basha Shek
|

Updated on: Mar 27, 2026 | 10:07 AM

Share

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది దివ్వెల మాధురి. మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ తో కలిసి ఉన్న ఆమె బిగ్‌బాస్ హౌస్‌లో కేవలం మూడు వారాలు మాత్రమే ఉంది. అయినా తన ఆట తీరు, మాటతీరుతో బిగ్ బాస్ ఆడియెన్స్ కు బాగానే చేరువైంది. మొదట్లో తన ‘ఫైర్ బ్రాండ్’ ట్యాగ్ కు తగ్గట్టుగానే తోటి కంటెస్టెంట్లతో దూకుడు స్వభావంతో వ్యవహరించిన ఆమె ఆ తర్వాత పూర్తిగా మారిపోయింది. మంచి గా మాట్లాడుతూ తోటి కంటెస్టెంట్లందరికీ దగ్గరైపోయింది. ముఖ్యంగా తనూజతో దివ్వెల మాధురికి మంచి అనుబంధం ఏర్పడింది. ఆ స్నేహంతోనే ఇటీవల తనూజ బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది. అలాగే పుట్టిన రోజు కానుకగా ఒక నెక్లెస్ కూడా ఇచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా జబర్దస్త్ వర్ష హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ఓ టాక్ షో కు దివ్వెల మాధురి హాజరైంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అలాగే తన జీవితంలో ఎదుర్కొన్న అవమానాలు, కష్టాలను షేర్ చేసుకుంది. వీటితో పాటు తన ఆస్తుల వివరాలపై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

‘‘మా ఆస్తుల వివరాలను చెప్పను కానీ, ప్రతి నెలా మేం మా వర్కర్స్‌కు రూ. 25 లక్షలు శాలరీ కింద ఇస్తాను. ఆస్తి ఎంత అంటే చెప్పలేను. కానీ దేవుడు ఇచ్చినంత అని మాత్రమే చెప్పగలను. నాకు గోల్డ్ అంటే ఇప్పటికీ చాలా ఇష్టం. మా ఆయన (దువ్వాడ శ్రీనివాస్) నాకు బంగారం కొనుక్కోమని.. రోజూ లక్ష రూపాయలు ఇస్తారు. నేను అది దాచిపెట్టి, ప్రతి నెలా రూ. 50 లక్షల బంగారం కొనుక్కుంటాను. నేను మొదటి నుంచి ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గానే ఉన్నాను. పెట్రోల్ బంక్స్ రన్ చేశాను, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాను. ఆ తర్వాత పాలిటిక్స్‌లోకి వచ్చాను. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ క్రియేట్ అయ్యాయి. రాజకీయాల వల్ల మైనింగ్, పోర్ట్ బిల్లుల రూపంలో సుమారు రూ. 50 కోట్ల వరకు నష్టపోయాం’ అని మాధురి చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

దువ్వాడ శ్రీనివాస్ తో దివ్వెల మాధురి..

ఇక ఇటీవల తిరుమల ఇష్యూపై స్పందించిన దివ్వెల మాధురి.. ‘తనూజ బర్త్ డే ఆ రోజు. అందరినీ వదిలి వచ్చింది కదా అని, నేనే కేక్ తీసుకెళ్లి కట్ చేయించాను. కానీ దాన్ని కూడా పెద్ద ఇష్యూ చేసేశారు. చాలా మంది నేను  క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నేను మాత్రం ఎక్కడా క్షమాపణలు చెప్పలేదు ‘అని చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
దయచేసి నాకు సపోర్ట్ చేయండి.. పండు మాస్టర్ వీడియో..
దయచేసి నాకు సపోర్ట్ చేయండి.. పండు మాస్టర్ వీడియో..
తెలంగాణకు మూడ్రోజుల పాటు వర్షసూచన.. లేటెస్ట్ రిపోర్ట్..
తెలంగాణకు మూడ్రోజుల పాటు వర్షసూచన.. లేటెస్ట్ రిపోర్ట్..
జుట్టు పెరుగుదలకు కరివేపాకా? రోజ్‌మేరీనా? రెండింట్లో ఏది బెస్ట్‌?
జుట్టు పెరుగుదలకు కరివేపాకా? రోజ్‌మేరీనా? రెండింట్లో ఏది బెస్ట్‌?
రోహిత్ శర్మకు హ్యాండిచ్చేస్తాడా.. అగార్కర్ మార్క్ వన్డే టీం ఇదేనా
రోహిత్ శర్మకు హ్యాండిచ్చేస్తాడా.. అగార్కర్ మార్క్ వన్డే టీం ఇదేనా
పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే.. కోవై సరళ..
పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే.. కోవై సరళ..
వారెవ్వా.. అదృష్టం అంటే వీరిదే..కేతువు ఎఫెక్ట్‌తో వీరి లైఫ్ టర్న్
వారెవ్వా.. అదృష్టం అంటే వీరిదే..కేతువు ఎఫెక్ట్‌తో వీరి లైఫ్ టర్న్
ఈ రాశులవారి జీవితంలో ఊహించని టర్నింగ్ పాయింట్.. మీరున్నారా?
ఈ రాశులవారి జీవితంలో ఊహించని టర్నింగ్ పాయింట్.. మీరున్నారా?
వీరికి అడుగడుగునా ఐశ్వర్యం అదృష్టమే..బుధ సంచారంతో ఊహించని ధన లాభం
వీరికి అడుగడుగునా ఐశ్వర్యం అదృష్టమే..బుధ సంచారంతో ఊహించని ధన లాభం
విశ్వకర్మ పూజ ఎప్పుడు? పూజా సమయం, ప్రాముఖ్యత, విశేషాలు ఇవే!
విశ్వకర్మ పూజ ఎప్పుడు? పూజా సమయం, ప్రాముఖ్యత, విశేషాలు ఇవే!
పాక్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు.. సముద్రంలో భారత యుద్ధనౌకను..
పాక్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు.. సముద్రంలో భారత యుద్ధనౌకను..