బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా సాగుతోంది. నిన్నటి ఎపిసోడ్ లో ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడంతో హౌస్ లో ప్రస్తుతం 13మంది హౌస్ మేట్స్ ఉన్నారు. ఆదివారం రోజు జరిగిన ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున హౌస్ మేట్స్‌తో సందడి చేశారు. గేమ్స్ ఆడించి అలరించారు. చివరిలో ఎలిమేషన్‌తో టెన్షన్ పెట్టారు. గత వారం నామినేషన్స్‌లో విష్ణు ప్రియా, సోనియా, శేఖర్ బాషా, నాగ మణికంఠ, పృథ్వీ, బెజవాడ బేబక్క ఉండగా ఒకొక్కరు సేవ్ అవుతూ వచ్చారు. శనివారం రోజు సోనియాని సేవ్ చేశారు.. ఇక ఆదివారం ఎపిసోడ్ లో శేఖర్ బాషాని.. తరువాత పృథ్వీ, విష్ణు ప్రియలను సేవ్ చేశారు. చివరికిగా నాగ మణికంఠ, బేబక్కలు మిగిలారు. ఈ ఇద్దరిలో నాగ మణికంఠను సేవ్ చేసి బేబక్కను ఎలిమినేట్ చేశారు.
అయితే చాలా మంది నాగమణికంఠ వెళ్ళిపోతాడని అనుకున్నారు. కానీ చివరిలో ఊహించని విధంగా బేబక్కను ఎలిమినేట్ చేసి అందరికి షాక్ ఇచ్చారు. అభయ్ నవీన్, శేఖర్ బాషా, సోనియా మిగిలినవారు మణికంఠ ఎలిమినేట్ అవుతాడని గట్టిగా ఫిక్స్ అయ్యారు.. కానీ సీన్ రివార్స్ అయ్యింది. చివరి వరకు మణికంఠ చాలా టెన్షన్ పడ్డాడు.
బేబక్క ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లిన తర్వాత మణికంఠ హౌస్‌లోకి వెళ్ళగానే అభయ్ ప్లేటు మార్చేసి అతన్ని హగ్ చేసుకున్నాడు. ఆదిత్య ఓం మణికంఠను ముద్దు పెట్టుకుని.. చెప్పాను కదా.. నిన్ను జనం సేవ్ చేస్తారని అని అతని చెవిలో చెప్పాడు. దానికి మణికంఠ థాంక్స్ అన్నా అన్నాడు. ‘నేను ఇంత త్వరగా వస్తానని అనుకోలేదు సార్.. బాధగా ఉంది సార్ అని ఎమోషనల్ అయ్యింది బేబక్క దానికి నాగార్జున ఓటింగ్ అనేది జనం చేతుల్లో ఉంది అని అన్నారు. ఇక బేబక్క జర్నీ చూపించారు. ఆతర్వాత బిగ్ బాస్ హౌస్‌లో ఉండటానికి అర్హత లేని వాళ్లని రోడ్డుపై పడెయ్ అనే టాస్క్ ఇచ్చాడు నాగార్జున. ముందుగా సోనియాని రోడ్డున పడేసింది బేబక్క. పృథ్వీని, నిఖిల్‌ని,రోడ్డున పడేసింది బేబక్క. ఒకొక్కరి గురించి బేబక్క చెప్తుంటే కిరాక్ సీత చాలా ఎమోషనల్ అయ్యింది. తెగ ఏడ్చేసింది. నిఖిల్ చెప్పినట్టే చేశాను.. అతని వల్లే నేను ఎలిమినేట్ అయ్యాను అని నిఖిల్ కు షాక్ ఇచ్చింది బేబక్క. దానికి నిఖిల్ సారీ కూడా చెప్పాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.