బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం అయ్యింది. ఈసారి హౌస్ లోకి చాలా మంది కొత్త మొఖాలు ఎంట్రీ ఇచ్చాయి. ఆదివారం ఎపిసోడ్ లో హోస్ట్ కింగ్ నాగార్జున ఒకొక్కరిని ప్రేక్షకులకు పరిచయం చేసి ఇద్దరిద్దరిని హౌస్‌లోకి పంపించారు. ఇక హౌస్ లోకి వెళ్లిన దగ్గర నుంచి హౌస్ మేట్స్ మధ్య రచ్చ మొదలైంది. నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ మధ్య గట్టిగానే రచ్చ జరిగింది. శేఖర్ బాషా వితండవాదానికి ఆకుల సోనియా అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. నాగార్జున ముందే చెప్పారు. ఈసారి హౌస్ లో అన్నీ అన్‌లిమిటెడ్ గా ఉంటాయి అని.. అన్నట్టుగానే నిన్నటి ఎపిసోడ్ లో గొడవలు అన్‌లిమిటెడ్ గా జరిగాయి. నిన్నటి ఎపిసోడ్ లో ఒకప్పటి హీరో ఆదిత్య ఓం.. నాగమణికంఠ దగ్గరికొచ్చి సారీ చెప్పాడు. హౌస్ లో నుంచి ఎవరిని బయటకు పంపాలి అంటే నేను నీ పేరు కావాలని చెప్పలేదు అని క్లారిటీ ఇచ్చాడు. మణికంఠ కాస్త పొగరుగా పర్లేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆతర్వాత నిఖిల్ మణికంఠతో మాట్లాడాడు. ఆదిత్య ఓం పెద్దోడు సారీ చెప్తే అలా గౌరవం లేకుండా మాట్లాడకూడదు అని ఎదో చెప్పాడు.
ఏం చెప్పాలో, ఎలా ఆడాలో నాకు తెలుసు .. ఎవరి సలహాలు అక్కర్లేదు అని పంచ్ వేశాడు. ఆ తర్వాత శేఖర్ బాషా తో కలిసి కొంతమంది అరెంజ్స్ తో క్యాచ్ లు ఆడుతూ సందడి చేశారు. ఎవరు ఆరెంజెస్‌తో ఆడుతున్నారో వాళ్లెవరూ తర్వాత దాన్ని ముట్టుకోవడానికి లేదంటూ చెప్పింది సోనియా. తినే ఫుడ్‌తో ఆటలు ఆడటం ఏంటి.? అని ఫైర్ అయ్యింది సోనియా. దాంతో మిగిలిన వారు సైలెంట్ అయినా.. శేఖర్ బాషా మాత్రం రైజ్ అయ్యాడు.
బిగ్‌బాస్ రూల్స్‌లో ఫుడ్డుతో ఆడకూడదని ఎక్కడైనా రాశాడా.. అరెంజ్స్ తో ఆడుకోకూడదు అని రూల్ ఎక్కడ లేదు అంటూ వాదన మొదలు పెట్టాడు. నీకు ఇచ్చిన ఫుడ్ నువ్వు కిందపడేసి తొక్కు , డ్రైనేజ్ లో పడేసుకో.. టేబుల్ పైన పెట్టుకో.. కానీ అది వేరేవాళ్లకు తిన్నాడని ఇవ్వకు అని అంది సోనియా. ఎవరైతే దాన్ని తినాలకునుంటున్నారో.. మనుషుల్లాగ తిందామనుకుంటున్నారో వాళ్లకి మాత్రం ఇవి పెట్టకండి..అంటూ కాస్త గట్టిగానే ఇచ్చి పడేసింది సోనియా.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.