బిగ్ బాస్ సీజన్ 8 ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది. కొత్త కంటెస్టెంట్స్ హౌస్ లోకి వచ్చిన తర్వాత ఆట మరింత రంజుగా మారింది. ఓజీ వర్సెస్ రాయల్ టీమ్స్ మధ్య చిత్ర విచిత్రమైన టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. ఇక ప్రస్తుతం హౌస్ లో నామినేషన్స్ హంగామా జరుగుతుంది. ఈ వారం హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక నేటి ఎపిసోడ్ కు సంబందించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమో చూస్తుంటే ఈ రోజు ఎపిసోడ్ లో రచ్చ గట్టిగానే జరిగేలా కనిపిస్తుంది. ఇక తాజాగా విడుదల చేసిన ప్రమోలో తేజను ఎలాగైనా నామినేషన్స్ లోకి తీసుకురావాలి అని నిఖిల్ ప్లాన్ వేస్తాడు. ఇదే విషయాన్నీ తన టీమ్ కు చెప్తాడు. డమ్మీ రీజన్‌తో రాయల్ నుంచి నామినేట్ చేయండి.. నబీల్ స్ట్రాంగ్ పాయింట్స్ చెప్పి తేజను నామినేట్ చేస్తాడు. అలా అయితే ఆటోమెటిక్‌గా తేజ నామినేట్ అవుతాడు అని నిఖిల్ ప్లాన్ వేస్తాడు.
ఆతర్వాత విష్ణుప్రియ అటు నిఖిల్ ఇద్దరూ వచ్చారు.. విష్ణు ప్రియా నయనిపవనిని నామినేట్ చేస్తున్నా అంటూ రీజన్ గా రివేంజ్ అని చెప్పింది. దాంతో బిగ్ బాస్ రివేంజ్ అనే రీజన్ కరెక్ట్ కాదు అని విష్ణుకి షాక్ ఇచ్చాడు. నిఖిల్ బ్యాచ్ వేసిన ప్లాన్ ను తేజ పసిగట్టాడు. దాంతో బేసిక్‌గా ఆ పక్కనోళ్లు ఏదో చెప్పేస్తే.. ఈ పక్కన ఎదో తుంబ్రీ రీజన్ చెప్పేస్తారు.. దాంతో నన్ను సెలక్ట్ చేస్తారని ఓ గ్రూప్ గా ప్లాన్ చేశారని నాకు అర్ధమైంది. ఇది నా పర్సనల్ ఒపీనియన్. దీన్ని ఓజీ వరసెస్ తేజ చేసేస్తున్నారు. సరే మీ ఇష్టం.. మీ ఆట మీరు ఆడండి .. నా ఆట నేను ఆడతా.. అని తేజ స్ట్రాంగ్ డైలాగ్ కొట్టాడు.
ఆతర్వాత పృథ్వీ అవినాష్ ను నామినేట్ చేశాడు. ప్రోమో చూసి నామినేట్ చేయడం ఏంటి అని పృథ్వీ అడిగాడు. అలాగే నేను 2 టాస్కుల్లోనే కనబడ్డానంటూ నామినేషన్ వేశావ్.. అది నాకు నచ్చలేదంటూ పృథ్వీ అన్నాడు. దానికి నేను చూసిన ఎపిసోడ్స్ లో రెండు మూడు టాస్కుల్లో తప్ప ఇంకెక్కడా కనిపించలేదు.. కానీ రెగ్యులర్‌గా చూసే మా వైఫ్ చెప్పింది అని అవినాష్ అంటే.. దానికి చీప్ గా మాట్లాడాడు పృథ్వీ. మీ వైఫ్ చూస్తే మరి మీ వైఫ్ రావాల్సింది బిగ్‌బాస్‌కి.. మీరెందుకొచ్చారు అని అన్నాడు. దానికి అవినాష్ వైఫ్ గురించి మాట్లాడొద్దు అని సీరియస్ అయ్యాడు. దాంతో ఇద్దరి మధ్య వాదన జరిగింది. ఈ క్రమంలో పృథ్వీ అవినాష్ ను రా అని అనడంతో అవినాష్ మండిపడ్డాడు. రా అనొద్దు అని అవినాష్ అంటే అంటాను అని పృథ్వీ రెచ్చిపోయాడు. ఇక ఈ ఇద్దరూ దాదాపు కొట్టుకున్నంత పని చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.