Bigg Boss Telugu 7: డేంజర్‌లో ఉన్నది ఎవరు..? టీవీ9 పోల్.. 16 వేల ఓట్లు.. ఫలితాలు ఇవిగో

|

Oct 11, 2023 | 3:35 PM

పాపం అమర్‌దీప్‌ను అయితే అందరూ టార్గెట్ చేస్తున్నారు. అతని ఫ్రెండ్స్ కూడా కనీసం పట్టించుకోవడం లేదు. ఇక ఆట ప్రకారం కొత్తగా వచ్చిన కంటెస్టెంట్స్‌లో ఎవరు డేంజర్‌లో ఉన్నారు. పాత వాళ్లలో ఎవరు ప్రమాదపు అంచున ఉన్నారు అనే అంశంపై టీవీ9 యూట్యూబ్‌లో పోల్ నిర్వహించాం. దాదాపు 16 వేల మంది ఈ పోలింగ్‌లో పాల్గొన్నారు. 

Bigg Boss Telugu 7: డేంజర్‌లో ఉన్నది ఎవరు..? టీవీ9 పోల్.. 16 వేల ఓట్లు.. ఫలితాలు ఇవిగో
Bigg Boss 7 Telugu
Follow us on

బిగ్ బాస్ సీజన్ 7 రసవత్తరంగా.. సాగుతోంది. ఆటగాళ్లు, పోటుగాళ్లు.. ఎవరి స్ట్రాటజీలతో వారు దూసుకుపోతున్నారు. ఇక మంచి ఫాలోయింగ్ ఉన్న ప్రశాంత్, శివాజీ, యావర్‌లో ప్రెండ్షిప్ చేసేందుకు కొత్త కంటెస్టెంట్స్ పోటీ పడుతున్నారు. భోలే శివాలి అయితే ఏకంగా భజన చేస్తున్నాడు. అటు అశ్విని కూడా ప్రశాంత్, యావర్‌లతో పులిహోర కలుపుతుంది. పూజా మూర్తి, నయని పవని పర్వాలేదనిపిస్తున్నారు. ఇక ఎవరి పంచన చేరుకుండా సొంతగా గేమ్ ఆడుతున్నది మాత్రం అంబటి అర్జున్. పాపం అమర్‌దీప్‌ను అయితే అందరూ టార్గెట్ చేస్తున్నారు. అతని ఫ్రెండ్స్ కూడా కనీసం పట్టించుకోవడం లేదు. ఇక ఆట ప్రకారం కొత్తగా వచ్చిన కంటెస్టెంట్స్‌లో ఎవరు డేంజర్‌లో ఉన్నారు. పాత వాళ్లలో ఎవరు ప్రమాదపు అంచున ఉన్నారు అనే అంశంపై టీవీ9 యూట్యూబ్‌లో పోల్ నిర్వహించాం. దాదాపు 16 వేల మంది ఈ పోలింగ్‌లో పాల్గొన్నారు.

కొత్తవాళ్లలో అశ్విని డేంజర్ జోన్‌లో ఉన్నారని 36 శాతం మంది పేర్కొన్నారు. అంబటి అర్జున్ ప్రమాదంలో ఉన్నారని 34 శాతం, పూజా మూర్తి డేంజర్‌లో ఉన్నారని 16 శాతం… నయని పవాని డేంజర్ జోన్‌లో ఉన్నారని.. 13 శాతం మంది ఓట్లు వేశారు. వాస్తవానికి  చెప్పాలంటే అశ్వినిని ఈ వారం పంపించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒక నామినేషన్ పడగానే ఆమె ఏడుపు లంఖించుకుంది. నేను ఉండను.. పోతా అని బిక్కముఖం వేసింది. కాస్త గ్లామర్ తప్పితే.. ఆమె ఆడుతున్నది కూడా ఏం లేదు.

ఇక పాత వాళ్లలో ఎవరు ప్రమాదంలో ఉన్నారని పోల్ పెడితే.. అమర్ దీప్‌ ఉన్నాడని దాదాపు 53 శాతం మంది ఓట్లు వేశారు. ఆ తర్వాత శోభా శెట్టి డేంజర్‌లో ఉందని.. 24 శాతం మంది.. తేజకు 13 శాతం మంది.. సందీప్‌కు తొమ్మది శాతం మంది ఓట్లు వేశారు. అనుకున్న స్థాయిలో ఆడటం లేదని అమర్‌ గురించి అందరూ అభిప్రాయపడుతున్నారు. అతనికి బయట మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి.. ఇప్పట్లో బయటకు వెళ్లే ఛాన్సులు లేవు. గేమ్ ప్లాన్ మారిస్తే మాత్రం అమర్ హీరో నుంచి జీరో అవుతాడు. కాగా ఈ పోలింగ్‌లో నామినేషన్‌లో లేని అర్జున్, సందీప్ నేమ్స్ కూడా ఇచ్చాం. కేవలం ఆటను బట్టి డేంజర్ జోన్ కేటగిరీలో  ఈ పోల్ నిర్వహించడం జరిగింది.

Bigg Boss

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.