Bigg Boss Telugu 7: ఈ వారం తేజ వెళ్లిపోతాడు అనుకున్నాం.. కానీ అనూహ్యంగా ఆ కంటెస్టెంట్..

|

Oct 05, 2023 | 12:23 PM

ఈ వీకెండ్ వైల్డ్ కార్డు ఎంట్రీలు జరగబోతున్నాయి. దీంతో ఆట అంతా తారుమారు అయ్యే చాన్స్ ఉంది. వచ్చినవాళ్లు ఏ గ్రూపుతో జట్టు కడతారు అన్నది ఇక్కడ ఇంట్రస్టింగ్ పాయింట్. బుర్ర ఉన్నవాళ్లు ఎవరైనా సరే.. స్టార్ మా సీరయల్ బ్యాచ్ పంచన చేరరు. అలా చేస్తే వాళ్లకే డ్యామేజ్ అన్నది తెలుసు. అయితే మరో కొత్త గ్రూప్ అయినా ఫామ్ చేయాలి.. లేదా శివాజీ కోటలో చేరిపోవాలి.

Bigg Boss Telugu 7: ఈ వారం తేజ వెళ్లిపోతాడు అనుకున్నాం.. కానీ అనూహ్యంగా ఆ కంటెస్టెంట్..
Bigg Boss Nominations
Follow us on

బిగ్ బాస్ ఉల్టా, పుల్టా సీజన్ 7 లో మరికొన్ని రోజుల్లో ఊహించని మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఈ వీకెండ్ వైల్డ్ కార్డు ఎంట్రీలు జరగబోతున్నాయి. దీంతో ఆట అంతా తారుమారు అయ్యే చాన్స్ ఉంది. వచ్చినవాళ్లు ఏ గ్రూపుతో జట్టు కడతారు అన్నది ఇక్కడ ఇంట్రస్టింగ్ పాయింట్. బుర్ర ఉన్నవాళ్లు ఎవరైనా సరే.. స్టార్ మా సీరయల్ బ్యాచ్ పంచన చేరరు. అలా చేస్తే వాళ్లకే డ్యామేజ్ అన్నది తెలుసు. అయితే మరో కొత్త గ్రూప్ అయినా ఫామ్ చేయాలి.. లేదా శివాజీ కోటలో చేరిపోవాలి. అయితే వచ్చేవాళ్లలో ఎక్కవమంది సీరియల్ ఆర్టిస్టులే ఉన్నారన్నది మరో ఇంట్రస్టింగ్ పాయింట్ ఇక్కడ. ఇకపోతే జోరుగా.. హుషారుగా ఓటింగ్ సాగుతుంది. ఈ వారం శోభా, ఆట సందీప్ తప్ప మిగిలిన వాళ్లందరూ నామినేషన్స్‌లో ఉన్న విషయం తెలిసిందే.

అనధికార పోల్స్‌లో శివాజీని అయితే ఎవరు అందుకునే పరిస్థితి కూడా లేదు. ఆ రేంజ్‌లో ఓటింగ్ పడుతుంది. ఇక ఆ తర్వాతి స్థానంలో ప్రిన్స్ యావర్ సత్తా చాటుతున్నాడు. టాస్కులు బాగా ఆడుతూ అభిమానాన్ని చూరగొంటున్నాడు. ఇక పెద్ద ఆటను ప్రదర్శించకపోయినా.. బయట ఉన్న తన ఫేమ్‌తో ఓట్లు పొందుతున్నాడు అమర్ దీప్. ఇక లా పాయింట్స్ మాట్లాడుతూ.. టాస్కుల్లో దొంగ వేషాలు వేస్తూ లాయరమ్మ శుభ శ్రీ ప్రజంట్ నాలుగవ స్థానంలో ఉంది. ఇక జెంటిల్‌మెన్ అన్న ట్యాగుతో నెట్టుకొచ్చేస్తున్నాడు గౌతమ్. ప్రజంట్ ఐదవ ప్లేసులో స్థిరంగా ఉన్నాడు. ఇక చివరి 2 స్థానల్లో తేజ, ప్రియాంక ఉన్నారు. వీరిలో ఒకరు ఈసారి ఇంటి నుంచి బయటకు రావాల్సిందే.

అందుకే ప్రియాంక డేంజర్‌లో…

సీరియల్ బ్యాచ్ సభ్యులైన అమర్, శోభ.. నామినేషన్స్ లేకపోయినప్పటికీ గత వీక్ ప్రియాంకకు చాలా తక్కువ ఓట్లు పడ్డాయి. ఈ సారి అమర్ నామినేషన్స్‌లో ఉన్నాడు. సో.. అమర్‌కు ఫ్యాన్స్ అతడిని సేవ్ చేసేందుకు ఓట్లు వేస్తారు. ఒకవేళ అతడు లేకుంటే.. ప్రియాంకకు వేసేవారు. దీంతో ప్రియాంకకు ఓట్లు వేసేవారు తక్కువైపోయారు. వాస్తవానికి ఈ వీక్ తేజ ఎలిమినేట్ అవుతారని అందరూ అనుకున్నారు. కానీ ప్రియాంకకు ఓట్లు వేసేవారు లేకపోవడంతో.. ప్రస్తుతానికి ఆమె ఇప్పుడు చివరి స్థానంలో ఉంది. ఈ రెండు రోజుల్లో ఏమైనా ఆటతీరు మెరుగు పరుచుకుంటే.. సరేసరి. ఒక చోట గుంపుగా చేరి గొణగడం కంటిన్యూ చేస్తే మాత్రం.. ప్రియాంక్ బ్యాగ్ సర్దుకోవాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి..