AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 10: ‘నాతో పెట్టుకోవద్దు.. ఆ కంటెస్టెంట్‌కు రామ్ ప్రసాద్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఏం జరిగిందంటే? వీడియో

జబర్దస్త్ లో కానీ ఇతర టీవీ షోల్లో కానీ సరదాగా నవ్వుతూ కనిపించే ఆటో రామ్ ప్రసాద్ సీరియస్ అయ్యాడు. 'నాతో పెట్టుకోవద్దు' అంటూ హౌస్ లో ఉన్న తోటి కంటెస్టెంట్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

Bigg Boss Telugu 10: 'నాతో పెట్టుకోవద్దు.. ఆ కంటెస్టెంట్‌కు రామ్ ప్రసాద్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఏం జరిగిందంటే? వీడియో
Bigg Boss Telugu 10
Basha Shek
|

Updated on: Sep 08, 2026 | 9:37 PM

Share

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో రచ్చ మొదలైంది. మొదటి రోజే కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఒకరిని ఒకరు తిట్టేసుకున్నారు. ఇక నామినేషన్స్ సందర్భంగా ఈ గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఎప్పుడూ సరదాగా కనిపించే జబర్దస్త్ కమెడియన్ ఆటో రామ్ ప్రసాద్ ఉన్నట్లుండి సీరియస్ అయ్యాడు. తోటి కంటెస్టెంట్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో రామ్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని పెంచుతున్నాయి. ఇకపై తనను నామినేట్‌ చేసే ముందు చాలా సార్లు ఆలోచించుకోవాలని రామ్ ప్రసాద్ ఎవరికో గట్టిగా వార్నింగ్‌ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ‘రేపటి నుంచి నేను ఎవరినైనా నామినేట్‌ చేయాలంటే మీరు ఊహించలేరు. ఇది ఒక రీజనా అని అడిగితే.. అఫ్‌కోర్స్‌ అని చెబుతా. మీరు చాలా తెలివైన వాళ్లని అనుకుంటున్నా. కాబట్టి గేమ్ జాగ్రత్తగా ఆడండి. నాతో మాత్రం పెట్టుకోవద్దు. నామినేషన్‌ చేసే ముందు చాలా సార్లు ఆలోచించండి’ అని తోటి కంటెస్టెంట్స్ కుస్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడీ జబర్దస్త్ స్టార్ కమెడియన్

అంతేకాదు.. రెడ్‌ గ్రూప్‌లో ఉన్న ఎనిమిది మంది సభ్యులు పక్కకు వెళ్లి మాట్లాడుకోవాలని సూచించాడు రామ్ ప్రసాద్. తమలో కనీసం ముగ్గురైనా తన మాట కరెక్ట్‌ కాదని చెబుతారని ఈ విషయంలో జాగ్రత్తగా నడుచుకోవాలన్నాడీ స్టార్ కమెడియన్. ప్రస్తుతం ఈ హాట్ డిస్కషన్ కు సంబంధించిన వీడియో వైరల్ గామారింది. అసలు బిగ్ బాస్ హౌస్ లో ఏం జరిగింది? రామ్ ప్రసాద్ ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు అన్నాడు? ఎవరిని నామినేట్‌ చేయబోతున్నాడు? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అంతేకాదు తనను నామినేట్ చేస్తే తాను కూడా ఊహించని విధంగా రియాక్ట్ అవుతానంటూ రామ్ ప్రసాద్ చెప్పడంతో నామినేషన్స్ ఏ రేంజ్ లో జరుగుతున్నాయో అర్థం అవుతోంది. దీనిపై ఫుల్ క్లారిటీ రావాలంటే ఇవాళ్టి ఎపిసోడ్ చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బిగ్ బాస్ హౌస్ లో జబర్దస్త్ రామ్ ప్రసాద్ ఉగ్రరూపం.. వీడియో ఇదిగో
బిగ్ బాస్ హౌస్ లో జబర్దస్త్ రామ్ ప్రసాద్ ఉగ్రరూపం.. వీడియో ఇదిగో
ఏదో ఓ ముద్దు పెట్టినంత మాత్రానా ఇదేం అడల్ట్ సినిమా కాదు
ఏదో ఓ ముద్దు పెట్టినంత మాత్రానా ఇదేం అడల్ట్ సినిమా కాదు
వీధి కుక్కల స్వైర విహారం.. కుక్క దాడిలో ఎద్దు మృతి.. రైతు ఆవేదన!
వీధి కుక్కల స్వైర విహారం.. కుక్క దాడిలో ఎద్దు మృతి.. రైతు ఆవేదన!
ఓటింగ్‌లో దూసుకుపోతున్న కామనర్.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు..!
ఓటింగ్‌లో దూసుకుపోతున్న కామనర్.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు..!
EV or CNG కార్.. మైలేజ్, మెయింటెనెన్స్ ఖర్చుల్లో ఏది బెస్ట్..!
EV or CNG కార్.. మైలేజ్, మెయింటెనెన్స్ ఖర్చుల్లో ఏది బెస్ట్..!
గుడికి వెళ్లే టైమ్ లేదా?.. ఇంట్లోనే ఇలా చేస్తే సరిపోతుందట!
గుడికి వెళ్లే టైమ్ లేదా?.. ఇంట్లోనే ఇలా చేస్తే సరిపోతుందట!
మాదాపూర్‌లో మహా మత్తు దందా..వాట్సాప్ ఆర్డర్లు..ర్యాపిడో డెలివరీలు
మాదాపూర్‌లో మహా మత్తు దందా..వాట్సాప్ ఆర్డర్లు..ర్యాపిడో డెలివరీలు
నోస్ బ్లీడింగ్ నుంచి కడుపు ఉబ్బరం వరకు.. ఈ లక్షణాలుంటే అలర్ట్
నోస్ బ్లీడింగ్ నుంచి కడుపు ఉబ్బరం వరకు.. ఈ లక్షణాలుంటే అలర్ట్
కూకట్‌పల్లి పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం..
కూకట్‌పల్లి పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం..
రోజువారీ కాఫీతో కాలేయానికి ఆరోగ్యం! నిపుణులు ఏం చెబుతున్నారంటే..
రోజువారీ కాఫీతో కాలేయానికి ఆరోగ్యం! నిపుణులు ఏం చెబుతున్నారంటే..