AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎస్ లేదా పైలట్.. అలాంటివాడే కావాలంటున్న బిగ్ బాస్ బ్యూటీ

సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి ఉండే క్రేజే వేరు.. ఈ చిన్నది షేర్ చేసే ఫోటోలు, వీడియోలు నెటిజన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కాగా గతంలో ఈ అందాల భామ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి

ఐపీఎస్ లేదా పైలట్.. అలాంటివాడే కావాలంటున్న బిగ్ బాస్ బ్యూటీ
Actress
Rajeev Rayala
|

Updated on: Feb 15, 2026 | 4:15 PM

Share

సోషల్ మీడియా ద్వారా క్రేజ్ తెచ్చుకున్న వారు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్న విషయం తెలిసిందే. అలాగే కొందరు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా క్రేజ్ తెచ్చుకొని ఆ తర్వాత సినిమాల్లో హీరోలు, హీరోయిన్స్, దర్శకులుగా రాణిస్తున్నారు. కాగా ఇప్పుడు ఓ ముద్దుగుమ్మ షార్ట్ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా క్రేజ్ తెచ్చుకున్న ఆ అమ్మడు ఇప్పుడు బిజీగా మారిపోయింది. సోషల్ మీడియాతో పాటు సినిమాల్లోనూ నటిస్తుంది. అలాగే బిగ్ బాస్ గేమ్ షో ద్వారా మరింత క్రేజ్ తెచ్చుకుంది ఆ చిన్నది. నెట్టింట ఆమె ఫోటోలకు, వీడియోలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఇంతకూ ఆమె మరెవరో కాదు. తనకు తల్లి, సోదరి తప్ప ఇంకెవరూ లేరని ఎమోష్నలైంది.

అప్పుడు అంట్లు తోమింది.. కట్ చేస్తే నటిగా సూపర్ క్రేజ్.. రాజకీయాల్లోనూ తోపు ఈమె

ఆమె ఎవరో కాదు.. క్రేజీ బ్యూటీ విష్ణుప్రియ. గతంలో విష్ణు ప్రియా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎమోషనల్ కామెంట్స్ చేసింది. విష్ణుప్రియ మాట్లాడుతూ.. తన తల్లి గతంలో హీరోయిన్స్ శ్రియ, ఆర్తి అగర్వాల్‌కు హెయిర్ డ్రెస్సర్‌గా పనిచేశారని, సినీ పరిశ్రమ గురించి ఆమెకు పూర్తి అవగాహన ఉందని తెలిపింది. తాను కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని తన తల్లి కోరుకున్నారని తెలిపింది. నన్ను సీరియల్స్ లో చూడాలని మా అమ్మ కోరుకుంది. కెరీర్ విషయానికి వస్తే, నటన పట్ల తన ఆసక్తి గురించి అడగగా, విష్ణుప్రియ ప్రస్తుతానికి సినిమాలపై దృష్టి పెడుతున్నా అని తెలిపింది.

ఇవి కూడా చదవండి

నాకు పెళ్లయింది అని చెప్పా.. ఆ సినిమా ఛాన్స్ మిస్ అయ్యింది..! షాకింగ్ విషయం చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ

తాను జీవిత భాగస్వామి కోసం చూస్తున్నానని, వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నానని తెలిపింది విష్ణుప్రియ. ఫిజికల్‌గా ఫిట్‌గా, ఐపీఎస్ లేదా పైలట్ లాగా స్మార్ట్‌గా ఉండే వ్యక్తి కోసం తాను ఎదురుచూస్తున్నానని, లేకపోతే తాను ఇంటి పట్టునే ఉండి జాతి రత్నాలు టైప్‌లో తిని పడుకుంటానని సరదాగా చెప్పుకొచ్చింది. మంచి పాత్రలు వస్తే తప్పకుండా సినిమాల్లో చేస్తానని, లేదంటే తన పని గురించి పెద్దగా సీరియస్‌గా లేనని ఆమె తెలిపింది విష్ణుప్రియ. ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది.

ఇప్పటికీ మిస్ అవుతున్నాం.! ఈ సినిమాలో నటించిన ఆరుగురు ఇప్పుడు మనతో లేరు..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి