
పప్పవి ప్రశాంత్ అరెస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బిగ్‌బాస్ హౌస్‌లో ఎంత డ్రామా ఉంటుందో… టైటిల్ గెలిచిన తర్వాత అంతకుమించిన హైడ్రామా నడిచింది. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ విషయంలో కూడా పెద్ద డ్రామా జరిగింది. చివరికి బిగ్‌బాస్ హౌస్ నుంచి ఓన్ హౌస్‌కి వెళ్లిన పల్లవిని.. ఇప్పుడు జైలర్ హౌస్‌కి తరలించారు పోలీసులు.బిగ్‌బాస్ విజేతగా అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటికి వచ్చాక ఓవర్ యాక్షన్ చేశాడు పల్లవి ప్రశాంత్. అప్పటికే అక్కడకు తరలివచ్చిన వేలాదిమంది అభిమానులకు సర్దిచెప్పాల్సింది పోయి.. వాళ్లను మరింత రెచ్చగొట్టేలా ప్రవర్తించాడు. పోలీసుల మాటను వినకుండా రోడ్లపై హంగామా సృష్టించాడు. దాంతో, రెచ్చిపోయిన ప్రశాంత్ ఫ్యాన్స్… విధ్వంసం సృష్టించారు.
ఆర్టీసీ బస్సులు, కార్లపై దాడిచేసి ధ్వంసంచేశారు. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్‌ను కంట్రోల్ చేయడానికి పెద్దఎత్తున పోలీసులను రంగంలోకి దింపాల్సి వచ్చింది. అయినా కూడా సిట్యువేషన్ కంట్రోల్ తప్పడంతో పెను విధ్వంసం జరిగింది.పల్లవి ప్రశాంత్ అరెస్ట్‌పై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. విధుల్లో ఉన్న పోలీసులకు ప్రశాంత్ ఆటంకం కలిగించాడన్నారు. ప్రశాంత్ కారణంగా పలువురు యువకులు వికృత చేష్టలకు పాల్పడ్డారని, పోలీసుల ముందే ఆరు ఆర్టీసీ బస్సులు ధ్వంసం చేశారన్నారు. పోలీసులను డ్యూటీ చేయకుండా పల్లవి ప్రశాంత్ అడ్డుకున్నారని.. న్యూసెన్స్ మొత్తం పోలీసుల కళ్ళముందే జరిగిందన్నారు పోలీసులు.
పల్లవి ప్రశాంత్ అరెస్ట్ పై బిగ్ బాస్ సెవన్ కంటెస్టెంట్ శుభ శ్రీ స్పందించింది.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఎంపీ భరత్ ఆధ్వర్యం లో జరిగిన యువత హరిత గో గ్రీన్ కార్యక్రమంలో బిగ్ బాస్ ఫేమ్ రతిక, శుభశ్రీ పాల్గొని సందడి చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పల్లవి ప్రశాంత్ అరెస్టుపై స్పందించింది శుభశ్రీ. పల్లవి ప్రశాంత్ ఆరెస్ట్ చాలా బాధగా ఉందన్నారు శుభశ్రీ. ఆ రోజు పోలీసులు కంట్రోల్ చేస్తుంటే బాగుండేదనీ. దానివల్ల ఈరోజు పల్లవి ప్రశాంత్ ఇబ్బంది పడుతున్నారన్నారు..రైతు బిడ్డగా పేరున్న ప్రశాంత్ జైల్ నుండి త్వరగా బయటికి రావాలని అని చెప్పుకొచ్చింది శుభ శ్రీ. రతికా పల్లవి ప్రశాంత్ అరెస్ట్ పై స్పందించలేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.