AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : బోనం ఎత్తిన బిగ్ బాస్ బ్యూటీ.. గోల్కొండలో సందడి చేసిన సీరియల్ నటి.. ఎవరో గుర్తుపట్టారా.. ?

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం, పాతబస్తీ లాల్‌దర్వాజా అమ్మవారి ఆలయంతో పాటు జీహెచ్‌ఎంసీ పరిధిలోని సుమారు 3 వేల ఆలయాల్లో బోనాల ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన బోనాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్ల నిధులు కేటాయించింది.

Tollywood : బోనం ఎత్తిన బిగ్ బాస్ బ్యూటీ.. గోల్కొండలో సందడి చేసిన సీరియల్ నటి.. ఎవరో గుర్తుపట్టారా.. ?
Priyanka Jain
Rajitha Chanti
|

Updated on: Jul 19, 2026 | 1:29 PM

Share

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల మహోత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. లంగర్‌హౌస్‌ నుంచి పోతరాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాల మధ్య ప్రభుత్వం తరఫున మంత్రులు పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ బంగారు బోనం, పట్టువస్త్రాలను సమర్పించారు. చారిత్రాత్మక గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో హైదరాబాద్ నగరం భక్తిరసంలో మునిగిపోయింది. తొలి రోజే వరుణుడు కూడా కరుణించడంతో భక్తులు మరింత ఆనందోత్సాహాలతో అమ్మవారిని దర్శించుకున్నారు. కొత్త కుండలో అన్నం, బెల్లం, పెరుగు, నెయ్యితో తయారు చేసిన నైవేద్యాన్ని నివేదించి, సకాలంలో వర్షాలు కురవాలని, అంటువ్యాధుల నుండి రాష్ట్రాన్ని రక్షించాలని వేడుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Kota Srinivasa Rao : ఆ హీరోలగా చేయాలంటే ఇంకో జన్మ ఎత్తాలి.. ఆరోజు అతడి కష్టాన్ని కళ్లరా చూశా.. కోట శ్రీనివాస్ రావు..

ఈ క్రమంలోనే బుల్లితెర నటి, బిగ్‌బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ గోల్కొండ బోనాల ఉత్సవాల్లో పాల్గొని సందడి చేశారు. ఆషాఢ మాస బోనాల సందర్భంగా ఆమె గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా బోనం సమర్పించారు. పట్టు లంగాణ వోణీ ధరించి, తలపై బోనం ఎత్తుకుని వెళ్తున్న తన వీడియోస్ వైరలవుతున్నాయి. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం బోనం ఎత్తడం తనకు ఎంతో సంతోషాన్ని, భక్తిభావాన్ని కలిగించిందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Srikanth: ఆ సినిమా తర్వాత నా గ్రాఫ్ మొత్తం పడిపోయింది.. చాలా దెబ్బ పడింది.. హీరో శ్రీకాంత్..

‘మౌనరాగం’ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రియాంక జైన్, ఆ తర్వాత బిగ్‌బాస్ తెలుగు సీజన్-7లో టాప్ కంటెస్టెంట్‌గా నిలిచి మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆమె పలు షోలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్నారు. సాంప్రదాయక లుక్‌లో ప్రియాంక బోనం ఎత్తిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Eknath Harika : భర్తతో కలిసి కొత్తింట్లోకి సీరియల్ బ్యూటీ.. నూతన గృహప్రవేశం చేసిన హారిక.. ఫోటోస్ వైరల్..

బోనం ఎత్తిన ప్రియాంక జైన్..

ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu : బిగ్ బాస్‏లోకి సీరియల్ బ్యూటీ.. కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ మళ్లీ వచ్చేస్తుంది.. ఇక ఎంటర్టైన్మెంట్ అదిరిపోవాల్సిందే..

Follow Us
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ రీసెంట్ గ్యాంబ్లింగ్ యాక్షన్ థ్రిల్లర్
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ రీసెంట్ గ్యాంబ్లింగ్ యాక్షన్ థ్రిల్లర్
అలాంటి నటుడిని ఎక్కడా చూడలేదు.. టాలీవుడ్ విలన్..
అలాంటి నటుడిని ఎక్కడా చూడలేదు.. టాలీవుడ్ విలన్..
పాప కిడ్నాప్‌కు ముందు దుర్మార్గుడు ఏం చేశాడంటే..
పాప కిడ్నాప్‌కు ముందు దుర్మార్గుడు ఏం చేశాడంటే..
ఈ రాశి వారికి నవరాత్రి ఉత్సవాలు వరం.. బంగారం లాంటి భవిష్యత్తు
ఈ రాశి వారికి నవరాత్రి ఉత్సవాలు వరం.. బంగారం లాంటి భవిష్యత్తు
శ్రీదేవి కంటే ముందు ఆ హీరోయిన్‏ను 10 ఏళ్లు లవ్ చేశా..
శ్రీదేవి కంటే ముందు ఆ హీరోయిన్‏ను 10 ఏళ్లు లవ్ చేశా..
బెల్లంతో సాఫ్ట్ మైసూర్ పాక్.. నోట్లో వెన్నలా కరిగిపోయే స్వీట్
బెల్లంతో సాఫ్ట్ మైసూర్ పాక్.. నోట్లో వెన్నలా కరిగిపోయే స్వీట్
చెన్నై మెట్రో ఫేజ్ 2 తొలి మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
చెన్నై మెట్రో ఫేజ్ 2 తొలి మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
పచ్చిమిరపకాయలతో పచ్చడి.. వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే భలే రుచి
పచ్చిమిరపకాయలతో పచ్చడి.. వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే భలే రుచి
5 నిమిషాల్లో చేసుకుని.. తినేకొద్దీ తినాలనిపించే కొత్తిమీర కారం
5 నిమిషాల్లో చేసుకుని.. తినేకొద్దీ తినాలనిపించే కొత్తిమీర కారం
అప్పుడే ఆమెకు పడిపోయా.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ మూములుగా లేదుగా
అప్పుడే ఆమెకు పడిపోయా.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ మూములుగా లేదుగా