Ashwini Sree: అశ్వినికి అదిరిపోయే ఆఫర్.. హీరోయిన్‌గా బిగ్ బాస్ గ్లామరస్ బ్యూటీ..

బిగ్ బాస్ సీజన్ 7 లో పాల్గొన్న వారిలో దాదాపు అందరూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా మంది ప్రేక్షకులకు కొత్తవారే కానీ బిగ్ బాస్ తర్వాత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు. వారిలో గ్లామరస్ బ్యూటీ అశ్విని శ్రీ ఒకరు. ఈ బ్యూటీ తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. గేమ్ తో పాటు బిగ్ బాస్ హౌస్ లో తన గ్లామర్ తో కవ్వించింది అశ్విని శ్రీ.

Ashwini Sree: అశ్వినికి అదిరిపోయే ఆఫర్.. హీరోయిన్‌గా బిగ్ బాస్ గ్లామరస్ బ్యూటీ..
Ashvini Sri

Updated on: Apr 08, 2024 | 2:32 PM

తెలుగు బిగ్ బాస్ మొత్తం మీద సీజన్ 7 కు మంచి టీఆర్పీ తో పాటు విపరీతమైన క్రేజ్ కూడా వచ్చింది. అంతే కాదు విమర్శలు కూడా బాగానే వచ్చాయి. బిగ్ బాస్ సీజన్ 7 లో పాల్గొన్న వారిలో దాదాపు అందరూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా మంది ప్రేక్షకులకు కొత్తవారే కానీ బిగ్ బాస్ తర్వాత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు. వారిలో గ్లామరస్ బ్యూటీ అశ్విని శ్రీ ఒకరు. ఈ బ్యూటీ తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. గేమ్ తో పాటు బిగ్ బాస్ హౌస్ లో తన గ్లామర్ తో కవ్వించింది అశ్విని శ్రీ. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన అశ్విని. ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచుకోలేకపోయింది. ఆ తర్వాత బిగ్ బాస్‌లో అవకాశం అందుకుంది. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగు పెట్టింది ఈ చిన్నది. హౌస్ లో తనను పట్టించుకోవడం లేదు అంటూ.. ప్రియాంక, శోభా శెట్టి పైన ఓ రేంజ్ లో ఫైర్ అయ్యి ఆడియన్స్ దృష్టిలో పడింది అశ్విని.

ఇప్పుడు ఈ చిన్నదానికి సినిమాల్లో ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అశ్విని. తన గ్లామరస్ ఫొటోలతో ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన గ్లామర్ ట్రీట్ తో కుర్రకారుకు కిర్రెక్కిస్తుంది ఈ బ్యూటీ. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు హీరోయిన్ గా మారింది.

అశ్విని హీరోయిన్ గా మిస్ జానకి అనే సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ సినిమా పూజాకార్యక్రమం జరిగింది. ఈ సినిమా గురించి అశ్విని మాట్లాడుతూ.. నా పర్సనాల్టీకి, నా హాట్ కు మ్యాచ్ అయ్యే కథ ఇది. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. కథ చాలా బాగుంది. ఆడియన్స్ కు ఖచ్చితంగా నచ్చుతుంది అని తెలిపింది అశ్విని. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ సినిమా తర్వాత అశ్విని హీరోయిన్ గా బిజీ అవుతుందని అంటున్నారు ఆమె అభిమానులు.

అశ్విని ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

అశ్విని ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.