
తెలుగు ఆడియెన్స్ కు అషు రెడ్డి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టిక్ టాక్ వీడియోలు, డబ్ స్మాష్ వీడియోలతో జూనియర్ సమంతంగా పేరు తెచ్చుకుందీ అందాల తార. ఆ తర్వాత బుల్లితెరపై అడుగు పెట్టింది. బిగ్ బాస్ షోలోనూ సందడి చేసింది. కొన్ని సినిమాల్లోనూ నటిగా మెరిసింది. ప్రస్తుతం యాంకర్ గా టీవీ షోస్, ప్రోగ్రామ్స్ తో బిజీగా ఉంటోన్న అషూ రెడ్డి ఉన్నట్లుండి ఆస్పత్రి పాలైంది. ఈ మేరకు ఆమె తన ఇన్ స్టా గ్రామ్ లో ఒక ఎమోషనల్ వీడియోను షేర్ చేసింది. దీనిని చూసి సినీ అభిమానులు, నెటిజన్లు కంగారు పడుతున్నారు. అషు రెడ్డిక ఏమైందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. కాగా అషు రెడ్డికి బ్రెయిన్ సర్జరీ జరిగింది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా తన సోషల్ మీడియా పోస్టులో తెలిపింది. వీడియోలో కూడా డాక్టర్స్ ఆమెకు బ్రెయిన్ ట్రీట్మెంట్ కు రెడీ చేయడం చూడవచ్చు. ముఖ్యంగా సర్జరీ కోసం జుట్టు కత్తిరించడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఈ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు అషు రెడ్డి తీవ్ర వేదన అనుభవించిందని తెలుస్తోంది. అలాగే సర్జరీ తర్వాత తాను ఎలా రివకరీ అయ్యిందో కూడా ఈ వీడియోలో చూపించిందీ అందాల తార. ‘ఈ జీవితం చాలా చిన్నది ఎంతోమంది, నా చుట్టూ ఉండి నేను కోలుకునేలా, ప్రార్థించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు’ అని తన ఆరోగ్య పరిస్థితిని వివరించింది అషు రెడ్డి. ఇక తన పోస్టుకు #brainsurgery, #recovery #thankfultoeveryone #journeyoflife, #Thankgod అనే హ్యాష్ ట్యాగ్ లు జోడించింది.
ప్రస్తుతం అషు రెడ్డి షేర్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. దీనిని చూసిన వారందరూ ఆమె త్వరగా కోలుకోవాలని సినీ అభిమానులు, నెటిజన్లు కోరుకుంటున్నారు. అయితే ఉన్నట్లుండి బ్రెయిన్ సర్జరీ ఎందుకు చేయించుకుందో మాత్రం క్లారిటీ ఇవ్వలేదీ బిగ్ బాస్ బ్యూటీ.
అయితే ఇది అకస్మాత్తుగా జరిగిన సంఘటన కాదని తెలుస్తోంది. గతేడాది ఆమెకు బ్రెయిన్ సర్జరీ జరిగినప్పటి వీడియోను మళ్లీ ఇప్పుడు షేర్ చేసినట్లు తెలుస్తోంది. ఆ సర్జరీ తర్వాత తానెలా రికవరీ అయ్యానో వివరిస్తూ ఈ వీడియోను పంచుకుంది అషు రెడ్డి. ఏదేమైనా ఈ బిగ్ బాస్ బ్యూటీ త్వరగా కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.