అబ్బా సాయి రామ్..! గొడవ పెట్టుకోవడం మంచిదైంది.. ఈవారం ఆమె సేఫ్

బిగ్ బాస్ సీజన్ 9 వారాంతం వస్తుందంటే చాలు.. ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తారా అని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.. ఈ సీజన్ 9లో డబుల్ ఎలిమినేషన్ కూడా జరిగింది. ఇక ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారా.. అని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

అబ్బా సాయి రామ్..! గొడవ పెట్టుకోవడం మంచిదైంది.. ఈవారం ఆమె సేఫ్
Biggboss 9

Updated on: Nov 23, 2025 | 12:06 PM

బిగ్ బాస్ సీజన్ 9లో ఊహించని ట్విస్ట్ లు జరుగుతున్నాయి. వారాంతం వచ్చిందంటే.. ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారా అని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.. ఒకొక్కసారి ఊహించని కంటెస్టెంట్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతున్నారు. అలాగే ఒకొక్కసారి డబుల్ ఎలిమినేషన్ అంటూ షాక్ ఇస్తున్నారు. అదేవిధంగా ఒకొక్కసారి ఎలిమినేషన్ కూడా ఉండటం లేదు. ఇక ఈ వారం హౌస్ నుంచి ఎవరు బయటకు వస్తారా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈవారం నామినేషన్స్ లో ఉన్న వారిలో ఇమ్మాన్యుయేల్, దివ్య, సంజన , డీమన్ పవన్ , భరణి, కళ్యాణ్ ఉన్నారు. వీరిలో ఒకరు హౌస్ నుంచి బయటకు వచ్చేస్తారని అనుకున్నారు.కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది.

ఇక ఓటింగ్ లో కళ్యాణ్ టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్నాడు. ప్రేక్షకులు కళ్యాణ్ కు భారీగా ఓట్లు వేస్తున్నారు. ఆతర్వాత భరణి, ఇమ్మాన్యుయేల్, పవన్ కు కూడా బాగానే ఓట్లు పడ్డాయి. చివరిగా సంజన, దివ్య డేంజర్ జోన్ లో ఉన్నారు. ఈవారం హౌస్ నుంచి దివ్య ఎలిమినేట్ అవుతుందని అంతా అనుకున్నారు. ఓట్ల ప్రకారం చూసుకున్నా దివ్య ఎలిమినేట్ అవ్వాలి.. కానీ ఈవారం ఆమె తప్పించుకుందని తెలుస్తుంది.

ఈ వారం హౌస్‌లో నో ఎలిమినేషన్ అని తెలుస్తుంది. ఈ వారం హౌస్ నుంచి ఎవ్వరూ ఎలిమినేట్ అవ్వరూ అని తెలుస్తుంది. దాంతో దివ్య ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వకుండా తప్పించుకుందని మీమ్స్ చేస్తున్నారు. ఇక ఈ వారం హౌస్‌లో దివ్యకు తనూజాకు పెద్ద వార్ నడిచింది. దివ్య, తనూజ ఓ రేంజ్‌లో గొడవ పడింది. ఇద్దరూ కొట్టుకునే రేంజ్‌లో గొడవపడ్డారు. దాంతో టీఆర్పీ ఓ రేంజ్ లో దూసుకెళ్లింది. దాంతో ఆమెను ఈ సమయంలో ఎలిమినేట్ చేయడం కరెక్ట్ కాదని భావించి ఈవారం హౌస్ లో నో ఎలిమినేషన్ పెట్టారని నెటిజన్స్ అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us