
తనూజ పుట్టస్వామి.. బిగ్ బాస్ సీజన్ 9లో మొదటి నుంచి అత్యధిక ఓటింగ్ తో టైటిల్ రేసులో దూసుకుపోయిన పేరు. ముద్ద మందారం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ అమ్మడు.. ఆ తర్వాత చాలాకాలం పాటు టీవీకి దూరంగా ఉండిపోయింది. ఆ తర్వాత కుకు విత్ జాతిరత్నాలు షోలో పాల్గొని ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 9లోకి అడుగుపెట్టింది. మొదటి వారం నుంచి ఊహించని విధంగా ఎక్కువ ఓటింగ్ రాబడుతూ టాప్ 1లో సత్తా చాటింది. చివరి నిమిషం వరకు విన్నర్ అయ్యేందుకు అత్యధిక ఓటింగ్ అందుకుంది. కానీ అందరూ ఊహించినట్లే స్వల్ప తేడాతో కళ్యాణ్ పడాల విజేతగా నిలిచాడు. విన్నర్ గా రూ. 35 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు కళ్యాణ్. అయితే విజేతగా ఏమాత్రం తీసిపోని స్థాయిలో రన్నర్ తనూజ సైతం ఎక్కువగానే పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి : Actress : ఎక్కువగా కనిపించాలని ఆ డైరెక్టర్ ప్యాడింగ్ చేసుకోమన్నాడు.. హీరోయిన్ సంచలన కామెంట్స్..
కర్ణాటకకు చెందిన తనూజ పుట్టస్వామి.. కన్నడలో పలు సినిమాల్లో నటించింది. 6-5=2, దండే బాయ్స్ అనే సినిమాల్లో నటించింది. అలాగే అందాల రాక్షసి సీరియల్లో చిన్న పాత్ర పోషించింది. అన్నపూర్ణ ప్రొడక్షన్స్ లో వచ్చిన ముద్ద మందారం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. అప్పట్లో ఈ సీరియల్ బుల్లితెరపై సూపర్ హిట్ అయ్యింది. కొన్నాళ్లపాటు తెలుగు స్మాల్ స్కీన్ కు దూరంగా ఉన్న తనూజ.. ఇప్పుడు బిగ్ బాస్ షో ద్వారా మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది. సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న తనూజ.. అదే ఫాలోయింగ్ కంటిన్యూ చేసింది. మొదటి వారం నుంచి మంచి ఓటింగ్ సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి : Jabardasth Emmanuel : చాలా వదులుకుని బిగ్బాస్ వరకు.. విన్నర్ కావాల్సినోడు.. ఇమ్మాన్యుయేల్ రెమ్యునరేషన్ ఎంతంటే..
అయితే ఫస్ట్ నుంచి బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ తనూజ అంటూ నెట్టింట తెగ ప్రచారం జరిగింది. అదే రేంజ్ లో ఓటింగ్ సైతం రావడంతో.. ఈసారి అమ్మాయి బిగ్ బాస్ విన్నర్ కావడం ఖాయమని అనుకున్నారు. చివరి వరకు క్షణక్షణం మధ్య ఉత్కంఠ నెలకొంది. కానీ ప్రతి విషయానికి ఏడవడం.. గొడవ పడడం ఆమె తనూజను ట్రోఫీకి దూరం చేశాయని చెప్పుకొవచ్చు. దాదాపు 15 వారాలు హౌస్ లో ఉన్న తనూజ.. బాగానే సంపాదించినట్లు తెలుస్తోంది. వారానికి రూ.2.50 లక్షల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. అంటే.. మొత్తం 15 వారాలకు గానూ ఆమెకు రూ.37 లక్షల 50 వేలు అందుకున్నట్లు తెలుస్తోంది. రన్నరప్ అయిన తనూజ తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. ఫ్యాన్స్ కారణంగానే తాను ఇక్కడి వరకు వచ్చానని.. ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : ఆ ముగ్గురికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన కళ్యాణ్.. తనూజ గురించి ఆసక్తికర కామెంట్స్..
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : బిగ్బాస్ విజేతగా కళ్యాణ్ పడాల.. ప్రైజ్ మనీతోపాటు ఎంత పారితోషికం తీసుకున్నాడో తెలుసా.. ?