Bigg Boss 9 Telugu Finale Live: గ్రాండ్‌గా బిగ్ బాస్ 9 ఫినాలే.. మరికొన్ని గంటల్లో విన్నర్ ఎవరో తేలిపోనుంది

Bigg Boss Telugu 9 Grand Finale live updates : బిగ్ బాస్ సీజన్ 9.. చివరి అంకానికి చేరుకుంది. ఫినాలే మొదలైంది. అదిరిపోయే సాంగ్ తో ఎంట్రీ ఇచ్చారు నాగార్జున. మరికొన్ని గంటల్లోనే ఈ సీజన్ విన్నర్ ఎవరనేది తెలియనుంది. కళ్యాణ్ పడాల, తనూజ మధ్య ఎవరు విజేత కాబోతున్నారనే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Bigg Boss 9 Telugu Finale Live: గ్రాండ్‌గా బిగ్ బాస్ 9 ఫినాలే.. మరికొన్ని గంటల్లో విన్నర్ ఎవరో తేలిపోనుంది
Biggboss9 Telugu

Updated on: Dec 21, 2025 | 9:26 PM

LIVE NEWS & UPDATES

  • 21 Dec 2025 09:25 PM (IST)

    స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చిన మాస్ మహారాజ్ రవితేజ

    స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చిన మాస్ మహారాజ్ రవితేజ.. అదిరిపోయే సాంగ్‌తో రవితేజ ఎంట్రీ, రవితేజతో పాటు ఆషిక రంగనాథ్, డింపుల్ హయతి ఎంట్రీ ఇచ్చారు.

  • 21 Dec 2025 09:21 PM (IST)

    డాన్స్‌తో అదరగొట్టిన డింపుల్ హయతి 

    డింపుల్ హయతి.. డాన్స్ పర్ఫామెన్స్‌తో మెప్పించింది. భర్తమహాశయులకు విజ్ఞప్తి సాంగ్ కు, అలాగే మరికొన్ని సాంగ్స్ కు స్టెప్పులేసింది డింపుల్ హయతి .


  • 21 Dec 2025 09:15 PM (IST)

    బిగ్ బాస్ నాకు చాలా నేర్పించింది: ఇమ్మాన్యుయేల్

    ఎలిమినేట్ తర్వాత బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చాడు ఇమ్మాన్యుయేల్.. బిగ్ బాస్ నాకు చాలా నేర్పించింది. నా పేరెంట్స్ విలువ తెలిసేలా చేసింది అని ఎమోషనల్ అయ్యాడు ఇమ్మాన్యుయేల్

  • 21 Dec 2025 09:12 PM (IST)

    కన్నీళ్లు పెట్టుకున్న ఇమ్మాన్యుయేల్ తల్లి..

    ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్ అవ్వడంతో తనూజ కన్నీళ్లు పెట్టుకుంది. అలాగే ఇమ్మాన్యుయేల్ తల్లి కన్నీళ్లు పెట్టుకున్నారు.

  • 21 Dec 2025 09:11 PM (IST)

    టాప్ 4 నుంచి ఇమ్మాన్యుయేల్ అవుట్..

    నలుగురిని గార్డెన్ ఏరియాలో ఉంచి.. రోగ్( రోబో డాగ్)ను ఒకరి దగ్గరకు వెళ్లి ఆగమని చెప్పారు. దాంతో ఆ రోగ్ ఇమ్మాన్యుయేల్ దగ్గర ఆగింది. దాంతో ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్ అయ్యాడు.


  • 21 Dec 2025 09:08 PM (IST)

    హౌస్‌లోకి వచ్చిన నవీన్ పోలిశెట్టి, మీనాక్షి

    హౌస్ లోకి  నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి వచ్చారు.. నవీన్ అడిగిన ప్రశ్నలకు రోగ్ సమాధానాలు చెప్పింది. డేంజర్ ఎవరు అంటే కళ్యాణ్ అని, ఫుడ్ దొంగతనం చేసింది ఎవరు అంటే తనూజ అని చెప్పింది రోగ్, అలాగే ఇంట్లో ఎక్కువ పని చెప్పింది( అంటే నిద్రపోయేది ) ఎవరు అంటే ఇమ్మాన్యుయేల్ అని చెప్పింది రోగ్,  ఇక నీకన్నా ఎక్కువ తెలివైనవారు ఎవరు అని అడగ్గా ఎవరు లేరు అని చెప్పింది. అలాగే ఎవరు ఎక్కువ ఏడుస్తారు అని చెప్పగానే తనూజ అని చెప్పింది. అలాగే ఎక్కువ కుళ్లు జోకులేసేది ఎవరు అంటే డీమన్ అని చెప్పింది రోగ్

  • 21 Dec 2025 08:58 PM (IST)

    బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన రోబో డాగ్

    బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన రోబో డాగ్, రోబో డాగ్ ను చూసి షాక్ అయిన టాప్ 4 మెంబర్స్

  • 21 Dec 2025 08:57 PM (IST)

    నవ్వులు పూయించిన నవీన్ పోలిశెట్టి.. 

    తన కామెడీతో నవ్వులు పూయించాడు నవీన్ పోలిశెట్టి.. అలాగే ఓ రోబోట్ డాగ్ ( రోగ్ )ను స్టేజ్ పైకి తీసుకొచ్చారు.

  • 21 Dec 2025 08:50 PM (IST)

    స్టేజ్ పైకి వచ్చిన నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి.

    స్టేజ్ పైకి వచ్చిన నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి. అనగనగ ఓ రాజు అనే పాట పాడుతూ డాన్స్ చేశాడు నవీన్. డాన్స్ ఇరగదీశాడు ఇద్దరూ..

  • 21 Dec 2025 08:49 PM (IST)

    భరణికి సారి చెప్పిన ఇమ్మాన్యుయేల్. 

    కళ్యాణ్, పవన్ కు థాంక్యూ చెప్పిన ఇమ్మాన్యుయేల్, అలాగే భరణికి సారి చెప్పాడు ఇమ్మాన్యుయేల్.

  • 21 Dec 2025 08:48 PM (IST)

    భరణికి సారీ చెప్పిన తనూజ..

    తనూజ కళ్యాణ్ కు థాంక్యూ చెప్పింది.  అలాగే భరణికి సారీ చెప్పింది తనూజ.. గేమ్ లో భరణిని తీసెయ్యాల్సి వచ్చిందని తనూజ చెప్పింది.. ఇక మనీష్ చెప్పిన ఒక్క మాట వాళ్ల నేను హర్ట్ అయ్యాను అని చెప్పింది తనూజ

  • 21 Dec 2025 08:41 PM (IST)

    డీమన్ కూడా తనూజాకు ఎల్లో బ్యాండ్ ఇచ్చాడు.

    తనూజాకు థాంక్యూ చెప్పిన పవన్. రీతూకు సారీ చెప్పాడు.. మొదటి నుంచి తనను భరించినందుకు సారీ చెప్పాడు. అలాగే దివ్యకు కూడా సారీ చెప్పాడు డీమన్.

  • 21 Dec 2025 08:39 PM (IST)

    తనూజాకు థాంక్యూ చెప్పిన కళ్యాణ్..

    కళ్యాణ్ తనూజాకు ఎల్లో బ్యాండ్ ఇచ్చి థాంక్యూ చెప్పాడు, అలాగే భరణికి సారీ చెప్పాడు కళ్యాణ్.. ఆయనకు నేను సపోర్ట్చేయలేకపోయా అన్నాడు కళ్యాణ్. అలాగే రమ్య నాకు సారీ చెప్పాలని కోరుకున్నాడు కళ్యాణ్. రమ్య సారీ కూడా చెప్పింది.

  • 21 Dec 2025 08:31 PM (IST)

    స్టేజ్ పైకి వచ్చిన బేబీ జోడి జడ్జెస్

    బేబీ జోడి జడ్జెస్.. హీరోయిన్ సదా, శేఖర్ మాస్టర్, శ్రీదేవి విజయ్ కుమార్. అలాగే బేబీ జోడి టీజర్ ను ప్లే చేశారు

  • 21 Dec 2025 08:24 PM (IST)

    భరణి నా ఫేవరెట్ కంటెస్టెంట్: శ్రీకాంత్

    భరణి నా ఫేవరెట్ కంటెస్టెంట్ అని చెప్పారు శ్రీకాంత్. భరణిలో తనని తాను చూసుకున్నాను అని అన్నారు శ్రీకాంత్.

  • 21 Dec 2025 08:23 PM (IST)

    బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చేసిన సంజన

    బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చేసింది సంజన. అందరూ నాకన్నా యంగ్… ఇక టాప్ 4లో ఉన్నవారిలో ఇమ్మాన్యుయేల్ విన్నర్ అవ్వాలని కోరుకుంది. అలాగే తనూజ కూడా విన్ అవ్వాలని కోరుకుంది సంజన.

  • 21 Dec 2025 08:20 PM (IST)

    సంజన అవుట్..

    ఫైనల్ గా సంజనను ఎలిమినేట్ చేశారు. సంజనను బయటకు తీసుకొచ్చారు శ్రీకాంత్

  • 21 Dec 2025 08:19 PM (IST)

    టెన్షన్ పెట్టిన శ్రీకాంత్.. కన్నీళ్లు పెట్టుకున్న కళ్యాణ్

    టాప్ 5 మెంబర్స్ కు వైట్ షర్ట్స్ ఇచ్చి.. ఆ షర్ట్ వెనక ఎవరు సేఫ్, ఎవరు ఎలిమినేట్ అన్నది రాస్తాను అని చెప్పారు శ్రీకాంత్.. అలాగే ఒకొక్కరి వెనక రాసి టర్న్ అవ్వమన్నారు. ముందుగా సంజన, తనూజ, ఇమ్మాన్యుయేల్, సంజన, పవన్ వెనుక సేఫ్ అని రాశారు. దాంతో కళ్యాణ్ చివరిగా ఉండటంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. కానీ కళ్యాణ్ వెనక కూడా సేఫ్ అని రాశారు శ్రీకంత్

  • 21 Dec 2025 08:15 PM (IST)

    ఇమ్మాన్యుయేల్ కామెడీ కింగ్ : శ్రీకాంత్

    ఇమ్మాన్యుయేల్ కామెడీ కింగ్ అన్నారు శ్రీకాంత్, తర్వాత సంజన, తనూజ తో కలిసి కామెడీ బాగా చేశాడు. ఇక సంజన నేను కలిసి ఓ సినిమా చేశాం.. ఆమె ఎప్పుడూ కామ్ గా ఉండేది. చాలా స్వీట్ ఆమె.. అన్నారు శ్రీకాంత్. మొదట్లో రెండు మూడు వారాల్లో వెళ్ళిపోతుందని అనుకున్నాం.. కానీ బాగా ఆడింది. ఇన్ని వారాలు మీ ఐదుగురు ఉన్నారంటే చాల గ్రేట్ అన్నారు శ్రీకాంత్

  • 21 Dec 2025 08:07 PM (IST)

    హౌస్‌లోకి వెళ్లిన శ్రీకాంత్

    హౌస్ లోకి వెళ్లిన శ్రీకాంత్ .. అలాగే టాప్ 5 ఒకొక్కరి గురించి తెలిపారు శ్రీకాంత్, తనూజ తెలుగమ్మాయిలా మారిపోయిందని, డీమన్ పవన్, కళ్యాణ్ కామనర్స్ గా వచ్చి సెలబ్రెటీలు అయ్యారు అని తెలిపారు. ముఖ్యంగా పవన్ టాస్క్ లు బాగా ఆడారు అని చెప్పరు శ్రీకాంత్. అలాగే పవన్, రీతూ బాండింగ్ గురించి మాట్లాడారు శ్రీకాంత్.

  • 21 Dec 2025 08:03 PM (IST)

    బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చిన హీరో శ్రీకాంత్ 

    బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చిన హీరో శ్రీకాంత్ .. కాగా శ్రీకాంత్ హౌస్‌లోకి వెళ్లి ఒకరిని ఎలిమినేట్ చేసి బయటకు తీసుకురావాల్సి ఉంటుంది

  • 21 Dec 2025 08:01 PM (IST)

    డాన్స్ వేసి అదరగొట్టిన రోషన్ , అనస్వర రాజన్

    ఛాంపియన్ సినిమా సాంగ్‌కు స్టేజ్ పై డాన్స్ వేసి అదరగొట్టిన రోషన్ , హీరోయిన్ అనస్వర రాజన్

  • 21 Dec 2025 07:59 PM (IST)

    స్టేజ్ పైకి వచ్చిన రోషన్, అనస్వర రాజన్

    స్టేజ్ పైకి వచ్చిన రోషన్, అనస్వర రాజన్.. ఛాంపియన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వచ్చిన రోషన్, అనస్వర రాజన్. అలాగే ఛాంపియన్ సినిమా ట్రైలర్ ప్లే చేసి చూపించారు

  • 21 Dec 2025 07:57 PM (IST)

    విన్నింగ్ స్పీచ్ ఇచ్చి టాప్ 5 నవ్వులు పూయించారు

    హౌస్ లో ఉన్నవారు విన్నర్  అయ్యి స్పీచ్ ఇస్తే ఎలా ఉంటుందో చూపించారు టాప్ 5.

    డీమన్ పవన్ స్పీచ్ ఎలా ఇస్తాడో  ఇమ్మాన్యుయేల్ చేసి చూపించాడు.

    అలాగే సంజన.. తనూజ స్పీచ్, డీమన్ పవన్.. కళ్యాణ్ స్పీచ్, తనూజ.. ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్.. సంజన స్పీచ్ ఇచ్చారు.

  • 21 Dec 2025 07:44 PM (IST)

    బిగ్ బాస్ స్టేజ్‌పై తన డాన్స్‌తో అదరగొట్టిన మంగ్లీ

    బిగ్ బాస్ స్టేజ్‌పై తన డాన్స్‌తో అదరగొట్టిన సింగర్ మంగ్లీ, బాయిలో బల్లి పలికే సాంగ్ కు స్టెప్పులేసి మంగ్లీ

  • 21 Dec 2025 07:43 PM (IST)

    అతనే విన్నర్ అంటున్న ఎక్స్ కంటెస్టెంట్స్

    విన్నర్ ఎవరు అవుతారు అని ఎక్స్ హౌస్ మేట్స్ ను అడిగి తెలుసుకున్నారు. దాంతో చాలా మంది కళ్యాణ్ పేరు, తనూజ పేరు చెప్పారు.

  • 21 Dec 2025 07:40 PM (IST)

    బిగ్ బాస్ సీజన్ 9 ట్రోఫీ అదిరిందిగా..

    బిగ్ బాస్ సీజన్ 9 ట్రోఫీ అదిరిందిగా.. స్టేజ్ పైకి ట్రోఫీని తీసుకువచ్చారు. సీజన్ 9 విన్నర్ ట్రోఫీతో పాటు, కారు, రూ. 50 లక్షలు అందజేయనున్నారు.

  • 21 Dec 2025 07:26 PM (IST)

    బిగ్ బాస్ సీజన్ 9 టోటల్ ఏవీ..

    బిగ్ బాస్ 9 మొదలైన దగ్గర నుంచి ఇప్పటివరకు, మొత్తం కలిసి ఓ వీడియో రూపంలో చూపించారు. హౌస్ మేట్స్ చేసిన అల్లరి, వాళ్ళ మధ్య అనుబంధం , టాస్క్ ల్లో రాణించడం, పోటీపడ్డ విధానాన్ని వీడియోలో చూపించారు.

  • 21 Dec 2025 07:10 PM (IST)

    టాప్ 5 కంటెస్టెంట్స్ పేరెంట్స్ కూడా వచ్చారు

    టాప్ 5 కంటెస్టెంట్స్ పేరెంట్స్ కూడా వచ్చారు. ఇమ్మాన్యుయేల్, సంజన, తనూజ, కళ్యాణ్, డీమన్ పవన్  కుటుంబ సభ్యులంతా వచ్చారు.

  • 21 Dec 2025 07:08 PM (IST)

    ఎక్స్ హౌస్ మేట్స్‌ను పలకరించిన నాగ్

    పాత కంటెస్టెంట్స్ అందరిని పేరు పేరునా పలకరించారు నాగార్జున. అందరి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు నాగార్జున

  • 21 Dec 2025 07:04 PM (IST)

    బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్.. 

    బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్.. బిగ్ బాస్ లో పాల్గొన్న అందరూ స్టేజ్ పైకి వచ్చారు..

  • 21 Dec 2025 07:02 PM (IST)

    గ్రాండ్ గా మొదలైన బిగ్ బాస్ 9 ఫినాలే

    సూపర్ స్టార్ మహేష్ బాబు వారణాసి సంచారి సాంగ్ తో ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 9,  అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన కింగ్ నాగార్జున

  • 21 Dec 2025 06:34 PM (IST)

    విన్నర్ ఎవరు అనేదాని పై ఆసక్తి

    బిగ్ బాస్ సీజన్ 9 ముగింపు వచ్చేస్తుంది.. విన్నర్ ఎవరు అనేదాని పై ఆసక్తి నెలకొంది

బిగ్ బాస్ సీజన్ 9 ముగింపు దశకు వచ్చేసింది. ఈ గత సీజన్స్ తో పోల్చుకుంటే ఈ సీజన్ ప్రేక్షకులను విశేషంగా మెప్పించింది. ఇక ఈ సీజన్ లో కామర్స్ తో పాటు సెలబ్రెటీలు కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. 7 సెప్టెంబర్ 2025 లో ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 9 విజయవంతంగా ముగింపు దశకు చేరుకుంది. ఇమాన్యుయెల్, కళ్యాణ్ పడాల, డీమాన్ పవన్, సంజనా గల్రానీ, తనూజ పుట్టస్వామి, భరణి, సుమన్ శెట్టి, రీతూ చౌదరి, దివ్య నిఖిత, గౌరవ్ గుప్తా, నిఖిల్ నాయర్, శ్రీనివాస్ సాయి, రాము రాథోడ్, దివ్వెల మాధురి, రమ్య మోక్ష, అయేషా జీనత్, శ్రీజ దమ్ము, ఫ్లోరా సైని , హరిత హరీష్, ప్రియా శెట్టి, మర్యాద మనీష్, శ్రష్ఠి వర్మ హౌస్ లో సందడి చేశారు.

ఇక హౌస్ లో టాప్ 5 గా ఇమ్మాన్యుయేల్, తనూజ, సంజన, కళ్యాణ్ , డీమన్ పవన్ నిలిచారు. కాగా వీరిలో విన్నర్ ఎవరు అవుతారని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కళ్యాణ్, తనూజ ఇద్దరిలో ఒకరు విన్నర్ అవుతారని ప్రేక్షకులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఇక ఈ ఫినాలేలో చాలా ఆసక్తికర విషయాలు జరగనున్నాయి అవేంటో చూద్దాం..