Bigg Boss 7 Telugu: తేజ సేఫ్.. ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆ ఇద్దరిలో ఒకరు..!

హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం హౌస్ లో పదిమంది ఉన్నారు. ఈ పదిమందిలో ఒకరు హౌస్ నుంచి బయటకు వెళ్లనున్నారు. ఈవారం నామినేషన్స్ లో టేస్టీ తేజా శుభశ్రీ, ప్రియాంక, అమర్ దీప్, యావర్, గౌతమ్ కృష్ణ, శివాజీ ఉన్నారు. అయితే వీరిలో ఈవారం ఊహించని ఎలిమినేషన్ జరగనుందని తెలుస్తోంది. వీరిలో తేజ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని తెలుస్తోంది. కానీ తేజ ఎలిమినేషన్ నుంచి తప్పుకున్నాడని తెలుస్తోంది.

Bigg Boss 7 Telugu: తేజ సేఫ్.. ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆ ఇద్దరిలో ఒకరు..!
Bigg Boss 7 Telugu Promo

Updated on: Oct 07, 2023 | 1:09 PM

వారాంతం వచ్చిందంటే చాలు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారా అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంటుంది. హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం హౌస్ లో పదిమంది ఉన్నారు. ఈ పదిమందిలో ఒకరు హౌస్ నుంచి బయటకు వెళ్లనున్నారు. ఈవారం నామినేషన్స్ లో టేస్టీ తేజా
శుభశ్రీ, ప్రియాంక, అమర్ దీప్, యావర్, గౌతమ్ కృష్ణ, శివాజీ ఉన్నారు. అయితే వీరిలో ఈవారం ఊహించని ఎలిమినేషన్ జరగనుందని తెలుస్తోంది. వీరిలో తేజ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని తెలుస్తోంది. కానీ తేజ ఎలిమినేషన్ నుంచి తప్పుకున్నాడని తెలుస్తోంది. ఆయన ప్లేస్ లో మరో హౌస్ మెంబర్ ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్నారని తెలుస్తోంది.

ఈ వారం హౌస్ లో ఉన్న పదిమందికి మరోసారి నాగార్జున క్లాస్ తీసుకోనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రోమోలో అది చూపించారు. నాగార్జున సందీప్, అమర్ దీప్ లకు కాస్త గట్టిగానే క్లాస్ తీసుకున్నట్టు చూపించారు. అలాగే శివాజీ, ప్రశాంత్ పై కూడా నాగ్ సీరియస్ అయినట్టు చూపించారు. ఇక ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరు అన్నదానిపై ఆసక్తి నెలకొంది.

ఈవారం హౌస్ నుంచి ప్రియాంక ఎలిమినేట్ అవుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి . ఆమె కు ఓటింగ్ లో తక్కువ శాతం రావడంతో ఈ వారం ఆమె హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అలాగే మరో హౌస్ మెంబర్ శుభ శ్రీ కూడా డేంజర్ జోన్ లో ఉందని తెలుస్తోంది. ఓటింగ్ లో శుభ శ్రీ కూడా వెనకబడటంతో ఆమె వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. మొత్తానికి తేజ ఈవారం సేవ్ అయ్యి ప్రియాంక, శుభ శ్రీ లలో ఒకరు ఎలిమినేట్ అవ్వనున్నారని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇక రేపటి ఎపిసోడ్ లో మరికొంతమంది కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి పంపించనున్నారు. మరో ఆరుగురు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లనున్నారని తెలుస్తోంది.

బిగ్ బాస్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.