
బిగ్ బాస్ హౌస్ లో మరోసారి రచ్చ మొదలైంది నిన్నటి ఎపిసోడ్ తో హౌస్ లో నామినేషన్స్ పర్వం మొదలయ్యాయి. నామినేషన్ లో ప్రిన్స్, తేజ, గౌతమ్, శుభశ్రీ, రతికా , ప్రియాంక నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో ఒకరు ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లనున్నారు. ఇదిలా ఉంటే ఈ నామినేషన్స్ లో గొడవలు మాములుగా జరగలేదు. ఒకరి పై ఒకరు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ముఖ్యంగా మరోసారి యావర్ కు ప్రిన్స్ కు మధ్య గొడవ జరిగింది. ఇద్దరు ఎప్పటిలానే కొట్టుకునే దాకా వెళ్లారు. ఇక గౌతమ్ తాను హర్ట్ అయ్యాను. నా సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గేలా మాట్లాడాడు అని అన్న కూడా జ్యురీ మెంబర్స్ వినిపించుకోలేదు. దాంతో గౌతమ్ కూడా కంట్రోల్ తప్పి రెచ్చిపోయాడు. ఆతర్వాత అమర్ దీప్ , పల్లవి ప్రశాంత్ మధ్య గొడవ జరిగింది. అలాగే శుభ శ్రీ అమర్ కూడా వాదనకు దిగారు. మొత్తంగా నామినేషన్స్ గందరగోళంగా జరిగాయి. ఇక నేటి ఎపిసోడ్ లో మరో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. నాలుగో పవర్ అస్త్ర కోసం ఓ టాస్క్ ఇచ్చాడు.
తాజాగా విడుదల చేసిన ప్రోమోలో బిగ్ బాస్ హౌస్ ఇప్పుడు బ్యాంక్ గా మారిందని చెప్పాడు. శివాజీ, శోభా శెట్టి, సందీప్ బ్యాంకర్లుగా ఉంటారని. మిగిలిన వారు కాయిన్స్ కలెక్ట్ చేయాలనీ.. ఎవరి దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉంటె వారు నాలుగో పవర్ అస్త్ర సాధించడానికి కంటెండర్స్ గా ఉంటారని చెప్పాడు బిగ్ బాస్. ఇందుకోసమే హౌస్ లో ఓ ఏటీఎం లాంటి మిషన్ ఉంచి దాని పై ఓ బజార్ ఉంచాడు.
కౌంట్ డౌన్ పూర్తయిన వెంటనే హౌస్ లిప్ ఉన్నవారు పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ బజార్ ను ప్రస్ చేయాలి ఎవరు ముందుగా చేస్తారో వారికి కాయిన్ లభిస్తుంది. దాంతో హౌస్ లో ఉన్నవారు ఒక్కసారిగా బజార్ నొక్కే ప్రయత్నం చేశారు. దాంతో అందరు ఒకరిమీద ఒకరు పడ్డారు. అయితే అమర్ ముందు నేను బజార్ నొక్కాను అని చెప్తుంటే శుభ శ్రీ కాను నేను ముందు నొక్కాను అంటూ వాదనకు దిగింది. అమర్ కాస్త గొంతు పెంచి నేనే నొక్కాను ముందు అంటూ అరిచి గోల చేశాడు. ఈ క్రమంలో ఒకరిమీద ఒకరు పడటంతో అక్కడప్రశాంత్ కు గాయం అయ్యిందని చూపించారు. అలాగే యావర్ కు కూడా గాయం అయ్యింది. కింద పడిపోయిన యావర్ తల పట్టుకొని ఉండిపోయాడు. అది గమనించిన అందరు ప్రశాంత్ దగ్గరకు వెళ్లి ఏమైందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్రశాంత్ కు గాయం అయ్యిందా..? బజర్ ఎవరు ముందు నొక్కారు అన్నది నేటి ఎపిసోడ్ లో తెలియనుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.