
బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి మన రైతు బిడ్డ ఆట ఆడటం మానేసి రతికా చుట్టూ తిరుగుతూ ఆడియన్స్ చేత విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇప్పటికీ కూడా అదే చేస్తున్నాడు. హౌస్ లోకి వచ్చిన దగ్గర నుంచి మనోడు రతికా చుట్టూ తిరుగుతూ గేమ్ ఆడటం మానేశాడు. దాంతో బిగ్ బాస్ కూడా ఈ ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ఇండైరెక్ట్ గా కామెంట్స్ కూడా చేశాడు. అలాగే హౌస్ లో ఉన్నవారు. కింగ్ నాగార్జున కూడా మనోడి పై ఇండైరెక్ట్ గా సెటైర్స్ వేశాడు. న గుండె నీదగ్గర ఉంది. అంటూ వెకిలి వేషాలు కూడా వేశాడు. అటు రతికా కూడా ప్రశాంత్ ను బాగానే ఎంకరేజ్ చేసింది. దాంతో ఈ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని అంతా అనుకున్నారు. ప్రశాంత్ కూడా రతికా ను మోహించాడు. ఆమె తన పై ప్రేమ చూపిస్తుందని అనుకున్నాడు. కానీ సీన్ రివర్స్ అయ్యింది.
ఈ మధ్య రతికా ప్రశాంత్ ను దూరం పెడుతూ వస్తుంది. అలాగే అతనిని ఎక్కడ ఇరికించాలో అక్కడ ఇరికిస్తుంది. దాంతో రైతుబిడ్డకు ఫ్యూజులు అవుట్ అవుతున్నాయి. ప్రతిసారి రతికా ప్రశాంత్ పై మండిపడుతూనే ఉంది. దాంతో రైతుబిడ్డ ఇప్పుడు రూట్ మరచాడు నిన్నటిదాకా రతికా చుట్టూ తిరిగిన ప్రశాంత్ ఇప్పుడు అక్క అంటూ ఆమె కళ్ళు పట్టుకున్నంత పని చేశాడు.
నిన్నటి ఎపిసోడ్ లో ప్రశాంత్ నామినేషన్ చేస్తున్న సమయంలో రతికాతో అతడి ప్రవర్తన గురించి వచ్చింది. రతికా పొట్టి బట్టలు వేసుకుంటుందని కామెంట్స్ చేశాడని బయట పెట్టాడు గౌతమ్. దాంతో రతికా కూడా అవును ప్రశాంత్ అన్నాడు అంటూ ఒప్పుకుంది. దాంతో ఇద్దరి మధ్య వాదన జరిగింది. నన్ను నువ్వు ఎలా పడితే అలా పిలుస్తున్నావ్ ఇంకోక్కసారి అలా పిలిస్తే బాగుండదు అని అంది. దాంతో మన రైతుబిడ్డ అవాక్ అయ్యి మరి ఏమని పిలవాలి అక్క అని పిస్తే ఓకే నా అన్నాడు. ఆతర్వాత ప్రశాంత్ వరస మార్చాడు. ఆతర్వాత రతికా కాళ్ల దగ్గర కూర్చుని మరీ క్షమాపణ కోరాడు పల్లవి ప్రశాంత్. నువ్వేమన్నావో.. ఏం చేశావో నేను మరచిపోను అంటూ సీరియస్ అయ్యింది రతికా.. దానికి వాటన్నింటికీ క్షమించమని కోరుతున్నాను అక్కా.. అంటూ దండం పెట్టేశాడు ప్రశాంత్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.