Bigg Boss 7 Telugu: ఓట్ అప్పీల్ ఛాన్స్ ఇచ్చిన బిగ్ బాస్.. శోభా మళ్లీ ఏడుపు మొదలు పెటింది

టీవీలో ప్రో కబడ్డీ ప్రోమోను చూపించారు బిగ్ బాస్. అందులో బాలకృష్ణను చూడగానే శివాజీకి మంచి ఊపొచ్చింది. బాలయ్యను చూసిన ఆనందంలో విజిల్స్ కొట్టి సందడి చేశాడు. చివరిలో జై బాలయ్య అంటూ నినాదాలు చేశాడు. ఆతర్వాత సీరియల్ బ్యాచ్ అంతా ఒక దగ్గర చేరారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ పై అమర్ మరోసారి ప్రియాంక , శోభా దగ్గర చెప్పాడు. అర్జున్ కూడా ప్రశాంత్ గురించి ఎదో చెప్పాడు. అటు శోభా యావర్ గురించి మాట్లాడింది. 

Bigg Boss 7 Telugu: ఓట్ అప్పీల్ ఛాన్స్ ఇచ్చిన బిగ్ బాస్.. శోభా మళ్లీ ఏడుపు మొదలు పెటింది
Bigg Boss 7

Updated on: Dec 06, 2023 | 7:31 AM

నిన్నటు ఎపిసోడ్ లో నామినేషన్స్ హీటు కనిపించింది. అమర్ ,ప్రశాంత్ మధ్య కోల్డ్ వార్ జరిగింది. అమర్ ప్రశాంత్ ను రెచ్చగొట్టేలా మాట్లాడుతూనే.. తాను అన్న మాటలను సమర్ధించుకునే ప్రయత్నం చేశాడు. ప్రశాంత్ కూడా అమర్ దీప్ అన్న మాటలకూ కౌంటర్లు ఇచ్చాడు. ఆ తర్వాత సీరియల్ బ్యాచ్ ఒక వైపు, శివాజీ బ్యాచ్  ఓవైపు కూర్చొని ఒకరిగురించి ఒకరు చెప్పుకున్నారు. ఆ తర్వాత టీవీలో ప్రో కబడ్డీ ప్రోమోను చూపించారు బిగ్ బాస్. అందులో బాలకృష్ణను చూడగానే శివాజీకి మంచి ఊపొచ్చింది. బాలయ్యను చూసిన ఆనందంలో విజిల్స్ కొట్టి సందడి చేశాడు. చివరిలో జై బాలయ్య అంటూ నినాదాలు చేశాడు. ఆతర్వాత సీరియల్ బ్యాచ్ అంతా ఒక దగ్గర చేరారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ పై అమర్ మరోసారి ప్రియాంక , శోభా దగ్గర చెప్పాడు. అర్జున్ కూడా ప్రశాంత్ గురించి ఎదో చెప్పాడు. అటు శోభా యావర్ గురించి మాట్లాడింది.

యావర్ శోభ మేకప్ గురించి కామెంట్ చేసిన విషయం తెలిసిందే.. దాని గురించి మాట్లాడుతూ.. నాకు  యావర్ మేనరిజం చేయడం నచ్చలేదురా.. నేను ఒక ఆర్టిస్ట్.. అది నా ప్రొఫెషన్.. నాకు మేకప్ అంటే ప్రాణం అంటూ శోభా చెప్పుకొచ్చింది. ఆ తర్వాత మిమ్మల్ని చూసే ప్రేక్షకులకి మీరు నేరుగా మీ ఓట్ అప్పీల్ హౌస్ మేట్స్ కు ఓ ఆఫర్ ఇచ్చాడు బిగ్ బాస్.

అయితే ఈ ఆఫర్ దక్కించుకోవడానికి కొన్ని గేమ్స్ ఆడాల్సి ఉంటుందని చెప్పాడు. గెలిచినవారికి ఓట్ అప్పీల్ అవకాశం ఉంటుందనిచెప్పాడు బిగ్ బాస్. అమర్‌ని మాత్రం యాక్టివిటీ ఏరియాలోకి పిలిచాడు బిగ్ బాస్. అమర్ ముందు ఓ కేజీ కేక్ ను ఉంచి 15 నిమిషాల్లో ఆ కేక్ మొత్తం తినాలి అని చెప్పాడు. ఆ కేక్ తింటే మిగిలిన హౌస్ మేట్స్ కు కూడా కేక్ వస్తుంది అని చెప్పాడు. కానీ అమర్ తినలేకపోయాడు. దాంతో సర్లే వదిలేయండి.. దీని సీక్రెట్ గా ఉంచాలని చెప్పాడు బిగ్ బాస్. బయటకు రాగానే ప్రియాంకా శోభా ఓటు అపీల్ చేశావ్ కదా అంటూ అడిగారు. దానికి అమర్ నోరు విప్పలేదు. ఆ తర్వాత అందరిని కూర్చోబెట్టి చిల్ పార్టీ అంటూ ఓ టాస్క్ ఇచ్చాడు. బజర్ మోగినప్పుడు స్విమింగ్ పూల్‌లోకి దూకి డ్యాన్స్ చేయాలి.. ఎవరు లేటుగా పూల్ లోకి దూకుతారో వారు అవుట్ అయినట్టు అని చెప్పాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో ముందు అమర్ అవుట్ అయ్యాడు. ఆతర్వాత సంచలక్ గా మారి లేటుగా దూకిన వారి పేర్లు బిగ్ బాస్ కు చెప్పాడు. శోభా ఈ టాస్క్ లో అవుట్ అవ్వగానే ఏడుపు మొదలు పెట్టింది నేను బ్లాంక్ అయ్యానురా.. కన్సిడర్ చేయొచ్చుగా అని అడిగింది. దానికి అమర్ అర్జున్ బదులు శోభా అడిదంట బిగ్ బాస్ నేను కన్సిడర్ చెయ్యొచ్చా అని అడిగాడు.. కానీ బిగ్ బాస్ నుంచి రిప్లే రాలేదు . ఆతర్వాత జంపింగ్ గేమ్‌లో  అంటూ ఓ గేమ్ ఆడించాడు.  ఆతర్వాత యావర్, శోభా చెరో గేమ్‌లో విన్ కావడంతో..ఇద్దరిలో ఒక్కరు మాత్రమే ఓట్ అప్పీల్ చేసుకోవాలి. మిగిలిన వారు ఎవరికీ సపోర్ట్ చేస్తే వారే విన్ అయినట్టు అని తెలిపాడు.