Bigg Boss 6 Telugu: మరోసారి రెచ్చిపోయిన గీతూ.. కోపంతో ఊగిపోయిన బాలాదిత్య..

|

Oct 07, 2022 | 3:47 PM

ఇప్పటికే గొడవలు, ఏడుపులు, గోలలతో రసాభాసంగా ఉన్న హౌస్ లో బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లు మరింత రచ్చ ను క్రియేట్ చేస్తున్నాయి.

Bigg Boss 6 Telugu: మరోసారి రెచ్చిపోయిన గీతూ..  కోపంతో ఊగిపోయిన బాలాదిత్య..
Bigg Boss
Follow us on

బిగ్ బాస్ హౌస్ లో హంగామా ఎప్పటిలానే రచ్చ రచ్చ గా మారుతోంది. కంటెంట్ కోసం ఎవరికీ నచ్చింది వాళ్ళు చేస్తున్నారు. ఇప్పటికే గొడవలు, ఏడుపులు, గోలలతో రసాభాసంగా ఉన్న హౌస్ లో బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లు మరింత రచ్చ ను క్రియేట్ చేస్తున్నాయి. ఈవారం కెప్టెన్సీ పోటీదారుల రేస్‌లో ఆర్జే సూర్య, బాలాదిత్య, సింగర్ రేవంత్‌లు నిలిచారు. ఇంటి కెప్టెన్ అవ్వడానికి పోటీదారులు.. ఇంటి సభ్యుల మద్దతు కూడగట్టుకోవాలని కోరారు. అంటేఎవర్నైతే కెప్టెన్‌గా చూడాలని అనుకుంటున్నారో వాళ్ల మెడలో పూల మాల వేయాలని కోరారు బిగ్ బాస్. ఈ పోటీలో ఎక్కువ దండాలు రేవంత్ కు వచ్చాయి.ఇక సింగర్ రేవంత్ కెప్టెన్ అయిన విషయం ఇప్పటికే లైవ్ ఎపిసోడ్స్ ద్వారా బయటకు వచ్చేసింది. ఇక రేవంత్  కెప్టెన్ అయిన తర్వాత బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ కాస్త గందరగోళాన్ని సృష్టించింది.

హౌస్ మేట్స్ లో ఇద్దరి నడుముకు తాడు కట్టి టగ్ ఆఫ్ వార్ ఇచ్చారు. ఈ టాస్క్ కు రేవంత్ సంచలక్ గా ఉన్నారు. అయితే తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ఈ టాస్క్ నేపథ్యంలో రేవంత్ కు చంటికి  మధ్య డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత బాలాదిత్యకు గీతుకు గట్టిగానే గొడవ అయ్యిందని తెలుస్తోంది.

గీతూ మరోసారి నోటిదూలతో బాలాదిత్యకు చిరాకు చెప్పించింది. దాంతో బాలాదిత్య కోపంతో దిగిపోయాడు. దేనికైనా లిమిట్ ఉంటుందని గీతూ పై అరిచేశాడు. ఇక బాలాదిత్య తప్పు అంటున్నా గీతూ మాత్రం వినిపించుకోకుండా వాగుతూనే ఉంది. దాంతో మనోడికి మరింత కాలింది. ఆ తర్వాత ఎం జరిగింది అనేది ఈరోజు జరిగే ఎపిసోడ్ లో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.