Bigg Boss Telugu 5: బిగ్ బాస్ హౌస్‌లో ఏం జరుగుతుందా.. అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో రోజు రోజుకు ఎక్కువవుతుంది. మొదటి ఎపిసోడ్ నుంచే సీజన్ 5 హంగామాగా సాగుతుంది. ఇప్పటికే హౌస్ నుంచి ఇద్దరు బయటకు వెళ్లిన విషయం తెలిసిందే. సరయు మొదటి వారం ఎలిమినేట్ అవ్వగా.. ఉమా దేవి రెండో వారంలో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు. ఇక బిగ్ బాస్ హౌస్‌లో కావాలినంత వినోదం దొరుకుంటుంది ప్రేక్షకులకు. కంటెస్టెంట్స్ మధ్య బిగ్ బాస్ పెడుతున్న టాస్కులు రణరంగంగా మారుతున్నాయి. తాజా నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా స్విమ్ జరా స్విమ్ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. స్విమింగ్ పూల్‌లో ఉన్న అక్షరాలను టేబుల్ పై సెట్ చేయమని టాస్క్ ఇచ్చాడు.
ఈ ప్రోమోలో సిరి షణ్ముఖ్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. తనతో ఎందుకు మాట్లాడటం లేదని షణ్ముఖ్ ను అడిగింది సిరి. దానికి వద్దులే అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు షన్ను. అయినా సిరి వదలకుండా ఏమైంది ఎందుకు నువ్ నాతో మాట్లాడటం లేదు అంటూ ప్రశ్నించింది. దానికి షణ్ముఖ్ నేను నోరు జారుతా ఎందుకులే వదిలేయ్ అంటూ సమాధానం చెప్పాడు. అయినా సిరి వదలకుండా షణ్ముఖ్ ను నాతో మాట్లాడు అంటూ బ్రతిమిలాడింది. అయినా సరే షణ్ముఖ్ సిరిని ఏవైడ్ చేశాడు. దాంతో సిరి అక్కడి నుంచి వెళ్ళిపోయి.. దూరంగా కూర్చొని కన్నీరు పెట్టుకుంది. ఈ రోజు జరిగే ఎపిసోడ్ ఆసక్తికరంగా ఉండబోతుందని ప్రోమో చూస్తే అర్ధమవుతుంది. చూడాలి మరి ఏంజరుగుతుందో..
మరిన్ని ఇక్కడ చదవండి :