Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ 5వ సీజన్ రసవత్తరంగా కొనసాగుతోంది. ఎపిసోడ్‌లు గడుస్తున్నా కొద్దీ ఒక్కో కంటెస్టెంట్ హౌజ్‌ను వదిలి పోతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్, హమీదా, శ్వేత, ప్రియ, లోబో, విశ్వ ఇలా.. తొమ్మిది మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. దీంతో షో ఇప్పుడు మరింత రసవత్తరంగా మారింది. కంటెస్టెంట్‌ల సంఖ్య తగ్గుతున్నా కొద్దీ ఈసారి టైటిల్ ఎవరు కొడుతారన్న దానిపై ఆసక్తి పెరుగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా మరో కంటెస్టెంట్ బిగ్‌బాస్ హౌజ్‌ను వదిలి వెళ్లడానికి సమయం ఆసన్నమైంది. ఆదివారం జరగబోయే ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ గుడ్‌బై చెప్పనున్నాడు. దీంతో ఎలిమినేట్ అయ్యేది ఈ కంటెస్టెంట్ అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి.
ఇక ఈ వారం నామినేషన్‌లో సిరి, రవి, సన్నీ, మానస్, కాజల్‌లు నామినేషన్‌లో ఉన్నారు. ఈ ఐదుగురిలో నుంచి కాజల్ హౌజ్‌ను వీడి వెళ్లనుందని వార్తలు షికార్లు చేస్తున్నాయి. అయితే దీనికి ఓ కారణాన్ని చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా కాజల్ హౌజ్‌లో యాక్టివ్‌గా ఉండడం లేదని, ఆటలో వెనకబడిపోయిందని బలంగా వినిపిస్తోంది. హౌజ్‌మేట్స్ కూడా కాజల్‌ను వరస్ట్ ఫర్ఫామర్‌గా ఎన్నికుని జైలుకు పంపించిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి హౌజ్‌ను వీడేది కాజల్ అన్న వార్తలకు బలం చేకూరింది.
ఇక నామినేషన్‌లో ఉన్న రవి, సన్నీలకు మంచి ఓటింగ్ వస్తుంది. కాబట్టి కాజల్, సిరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారని చర్చ జరుగుతోంది. అయితే షణ్ముఖ్ ఎలిమినేషన్‌లో లేడు కాబట్టి.. అతనికి పడాల్సిన ఓట్లన్నీ సిరికి పడతాయని, ఈ కారణంగానే కాజల్ కథ ఈసారి కంచికి చేరుతుందని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. బిగ్‌బాస్ అంటేనే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం.. మరి కాజల్ నిజంగానే ఎలిమినేట్ అవుతుందా.? లేదా మరెవరైనా ఇంటి నుంచి వెళ్లిపోనున్నారా.? తెలియాలంటే ఆదివారం వరకు వేచి చూడాల్సిందే.
Afghanistan Blast: ఆఫ్ఘనిస్థాన్ లోని మసీదులో మళ్ళీ బాంబు పేలుడు.. సుమారు 12 మందికి గాయాలు..
Afghanistan Blast: ఆఫ్ఘనిస్థాన్ లోని మసీదులో మళ్ళీ బాంబు పేలుడు.. సుమారు 12 మందికి గాయాలు..