Bigg Boss 5 Telugu: బిగ్ హౌస్ నుంచి ఈ వారం ఎలిమినేషన్ ఆ కంటెస్టెంటే.. ఎవరంటే

బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు వచ్చేస్తుంది.. 19 మందితో మొదలైన ఈ గేమ్ షో.. వారం వారం రసవత్తరంగా సాగుతూ వస్తోంది.

Bigg Boss 5 Telugu: బిగ్ హౌస్ నుంచి ఈ వారం ఎలిమినేషన్ ఆ కంటెస్టెంటే.. ఎవరంటే
Bigg Boss 5 Telugu

Updated on: Nov 21, 2021 | 6:56 AM

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు వచ్చేస్తుంది.. 19 మందితో మొదలైన ఈ గేమ్ షో.. వారం వారం రసవత్తరంగా సాగుతూ వస్తోంది. ఇక హౌస్ లో గొడవలు, గోలలు, అప్పుడప్పుడు రొమాన్స్ తో రచ్చ చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు హౌస్ నుంచి ఒక్కొక్కరు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉంటారన్న వారు అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేస్తున్నారు. దాంతో ఈ వారం హౌస్  నుంచి ఎవరు బయటకు వచేస్తారన్నది ఇంట్రస్టింగ్ గా మారింది. అయితే ఈవారం ఎలినేషన్ ప్రక్రియ జరగనుంది. అయితే ఈవారం హౌస్ నుంచి బయటకు వచ్చేది ఆ కంటెస్టెంటే అని జోరుగా ప్రచారం జరుగుతుంది.

హౌస్ లో ఉన్న వాళ్లలో పెద్ద అయిన అనీ మాస్టర్ ఈ వారాం హౌస్ నుంచి బయటకు వచేస్తున్నారని తెలుస్తుంది. మొదటి నుంచి హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న ఆనీ మాస్టర్ ఈ మధ్య కాలంలో ఎక్కువ టార్గెట్ అయ్యేరు. అంతే గేమ్ ఆడే సమయంలో హౌస్ మేట్స్ తో ఎక్కువ గొడవలు పడుతూ కనిపించింది. పైగా అందరు గ్రూప్ జీ గేమ్ ఆడుతున్నారంటూ అరవడం , ఏడవడం వంటివి చేస్తూవస్తోంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో కూడా ఆనీ మాస్టర్ ఏడుస్తూ కనిపించింది. సిరి, షన్ను, మానస్, ఆనీలను కన్ఫెషన్ రూంలోకి పిలిచాడు నాగార్జున. ఒక్కొక్కరికి ఇవ్వాల్సిన సూచనలు, తీసుకోవాల్సిన క్లాస్ లు తీసుకున్నాడు. ఆనీ మాస్టర్ ను పిలిచి మెచ్యూర్డ్ ఇమ్మెచ్యూర్డ్ అంటే తేడా తెలుసు కదా? ఎక్కడి వరకు ఆపాలో తెలియాలి.. కాజల్ విషయంలో ఇమిటేషన్ స్థాయి దాటిపోతోంది అని ఆనీ మాస్టర్‌కు చురకలు అంటించాడు నాగ్. సారి ఇకపై అలా చేయను. నాలో ఓ చైల్డిష్ బిహేవియర్ ఉంది.. దాన్ని కూడా కంట్రోల్ చేసుకుంటాను అని అంది. మరి ఈ  రోజు జరిగే ఎపిసోడ్ లో ఆనీ మాస్టర్ హౌస్ నుంచి బయటకు వెళ్లే చాన్సులే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Hyderabad: ఇకపై థియేటర్లలో పార్కింగ్‌ ఫీజు చెల్లించాల్సిందే.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం..

ఇండియాలో మొట్టమొదటి ‘లేడీ సూపర్ హీరో’ చిత్రం.. 3డిలో అదరగొట్టనున్న మాజీ మిస్‌ ఇండియా..

Varshini Sounderajan: తన ఒంపుసొంపులతో ఫిదా చేస్తున్న వర్షిణి లేటెస్ట్ పిక్స్