బిగ్ బాస్ హౌస్‌లో పరిణామాలు రోజురోజుకి మారిపోతున్నాయి. ఈ విషయం మేము అనడం కాదు..హౌస్‌లో ఉన్న సభ్యులే చెబుతున్నారు. అవసరాల కోసం అడ్డదార్లు తొక్కే పాత్రలే తప్ప, మనవాళ్లు లేరు అంటున్నారు బిగ్ బాస్ హౌస్ సభ్యులు. ఇటీవల కెప్టెన్ అయిన నోయల్ మంచి జోష్‌లో కనిపిస్తున్నాడు. మొదట్లో ప్రతి విషయాన్ని రాద్దాంతం చేసిన నోయల్, నాగ్ వార్నింగ్‌తో చల్లబడ్డాడు. అయితే ఇదే క్రమంలో అతడు లేని పెద్దరికాన్ని ప్రదర్శిస్తున్నాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు..అతను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కుమార్ సాయిని అతడు పదే, పదే టార్గెట్ చేస్తున్నాడన్న వాదనలు వినిపిస్తున్నాయి. అతనే కాదు మొదట్లో అందరూ కుమార్ సాయిని నామినేట్ చేసేవారు. అందుకు అతడు జనాలతో కలవడం లేదన్న కారణం చెప్పేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. కుమార్ సాయి టాస్క్ అంటే చాలు నేను రెడీ అంటూ ముందకు వస్తున్నాడు. బిగ్ బాస్‌తో డీల్ ఆర్ నో డీల్ టాస్కులలో అతడు మంచి ప్రదర్శన చేశాడు. ఒంటిపై బట్టుల అన్నీ ముక్కలు, ముక్కులుగా చేయడం, ఒంటి చేత్తే ఇసుక బస్తాను చాలా సమయం హోల్డ్ చేయడం వంటి రిస్కీ టాస్కులు పూర్తి చేశాడు. ఇక్కడున్న సమస్య ఏంటి అంటే కుమార్ సాయికి మద్దతు తెలిపేవాళ్లు లేకపోవడం. అందుకే అతడు సింగిల్‌గానే గేమ్స్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో కెప్టెన్ అయినా గానీ ఇమ్యునిటీ లభించని నోయల్ తాను సేవ్ అయ్యేందుకు కుమార్ సాయిని టార్గెట్ చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. తాజా ప్రోమోలో కూడా ‘ఒక్క రోజన్న నిజాయితీగా ఉండు సాయి’ అంటూ నోయల్ అతడిపై బాణాన్ని గురిపెట్టాడు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే కుమార్ సాయిని ప్రతి వారం నామినేట్ చేస్తున్నా కూడా అతడిని వీక్షకులు సేవ్ చేస్తూనే ఉన్నారు. అయితే బిగ్ బాస్ అంటేనే సంచలనాల నిలయం. మరి ఈ వారం ఏం జరుగుతుందో చూాడాలి.