AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 10 Telugu : అప్పుడు తెలుగులో బ్యాన్ చేశారు.. కట్ చేస్తే.. ఇప్పుడు బిగ్ బాస్‏లోకి ఎంట్రీ.. బుల్లితెరపై భారీ క్రేజ్..

మరికొన్ని నెలల్లో బిగ్ బాస్ 10వ సీజన్ స్టార్ట్ కాబోతుంది. ఈ క్రమంలో ఇప్పటికే అగ్నీ పరీక్ష అడిషన్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ఈ షో సైతం స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈసారి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే సెలబ్రెటీల గురించి రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈసారి కూడా ఎప్పటిలాగే సీరియల్ బ్యూటీల హావా ఉండనుందని టాక్. తాజాగా మరో ముద్దుగుమ్మ పేరు తెరపైకి వచ్చింది.

Bigg Boss 10 Telugu : అప్పుడు తెలుగులో బ్యాన్ చేశారు.. కట్ చేస్తే.. ఇప్పుడు బిగ్ బాస్‏లోకి ఎంట్రీ.. బుల్లితెరపై భారీ క్రేజ్..
Pallavi Gowda
Rajitha Chanti
|

Updated on: Jul 14, 2026 | 9:23 PM

Share

బుల్లితెరపై అత్యంత క్రేజ్ ఉన్న రియాల్టీ షో బిగ్ బాస్. ఇప్పటికే తెలుగులో 9 సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈ షో.. ఇప్పుడు పదవ సీజన్ స్టార్ట్ కాబోతుంది. ఈసారి దశావతారం అంటూ సరికొత్తగా ఉండనుందని.. అలాగే రూల్స్ సైతం మారనున్నట్లు టాక్ వినిపిస్తుంది. అలాగే ఇప్పటికే టీజర్ల ద్వారా షో పై మరింత ఆసక్తి కల్పిస్తున్నారు హోస్ట్ నాగార్జున. ఇదిలా ఉంటే.. ఈసారి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే సెలబ్రెటీల పేర్లు సోషళ్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అలాగే ఈసారి కూడా సీరియల్ బ్యూటీలు.. కన్నడ ముద్దుగుమ్మల హవా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే పలువురు పేర్లు నెట్టింట చక్కర్లు కొట్టగా.. ఈసారి మరో అమ్మడు పేరు వినిపిస్తుంది. ఆమె మరెవరో కాదు.. పల్లవి గౌడ. తెలుగు ప్రేక్షకులకు ఈ ముద్దుగుమ్మ సుపరిచితమే. పసుపు కుంకుమ సీరియల్ ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. అందులో తన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత సావిత్రి సీరియల్ ద్వారా మరోసారి మెప్పించింది. అయితే ఈ రెండు సీరియల్స్ లో కథానాయికగా అలరించిన ఈ అమ్మడు. చదరంగం అనే సీరియల్లో మాత్రం విలన్ పాత్రలో అదరగొట్టింది. అయితే సీరియల్స్ ద్వారా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మను ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీ బ్యాన్ చేసింది. ఈ విషయాన్ని గతంలో స్వయంగా పల్లవి గౌడ బయటపెట్టింది.

ఎక్కువ మంది చదివినవి : S Janaki: ఆ ఒక్క పాట.. జానకమ్మ స్వరంలో మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీ.. అప్పుడు ఇప్పుడు యూత్ ఫేవరేట్ సాంగ్..

తెలుగులో సెకండ్ సీరియల్ చేస్తున్న సమయంలో తనకు ఓ మూవీ షూట్ ఉందని.. అది ఔట్ డౌర్ కావడంతో టీమ్ వాళ్లతో మాట్లాడి పర్మిషన్ తీసుకున్నానని.. అదే సయంలో వాళ్లు కూడా స్టోరీలో మార్పులు చేస్తున్నారని.. అందుకే అప్పుడు వాళ్లకు కూడా ఈజీగా ఉందని తెలిపింది. అయితే వాళ్లతో అగ్రిమెంట్ లో ఓ విషయం ఉందని.. ఈ సీరియల్ టెలికాస్ట్ ఎపిసోడ్ అయిపోయేవరకు నేను తెలుగులో ఏ సీరియల్ చేయకూడదు అని అందులో ఉందని… కానీ షూట్ కోసం బెంగుళూరు వెళ్లాల్సి వచ్చి అక్కడే 25 రోజులపాటు బ్లాక్ అయిపోయానని.. దీంతో అదే సమయంలో సీరియల్ యాజమాన్యం తనను ఇబ్బంది పెట్టిందని అన్నారు. తనకు పేమెంట్ ఇవ్వకపోయినా రెండు నెలలు పనిచేశానని.. అగ్రిమెంట్ ఇవ్వకపోతే వేరే సీరియల్ చేస్తానని చెప్పానని.. దీంతో తను బ్యాన్ చేశారని చెప్పుకొచ్చింది. కొన్నాళ్లపాటు తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది పల్లవి గౌడ.

ఎక్కువ మంది చదివినవి : Singer S Janaki : పుట్టింది రేపల్లే పల్లపట్లలో.. పెరిగింది కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో.. జానకమ్మ ప్రస్థానం ఇదే..

ఇటీవలే నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ద్వారా తిరిగి తెలుగు బుల్లితెరపై సందడి చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడి పేరు నెట్టింట తెగ వైరలవుతుంది. త్వరలోనే స్టార్ట్ కానున్న బిగ్ బాస్ 10లోకి ఈ ముద్దుగుమ్మ ఎంట్రీ ఇస్తుందని ప్రచారం నడుస్తుంది. అంతేకాదు.. ఈ షో కోసం ఈ బ్యూటీకి భారీగానే రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు టాక్. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. అటు పల్లవి గౌడ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..

పల్లవి గౌడ..

ఎక్కువ మంది చదివినవి : OTT Cinema : అడవిలో అమ్మాయి మరణం.. ఓటీటీని అల్లాడిస్తున్న థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు..

Follow Us